టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వెనుక ఇంత క్రైమ్ ఉందా..!

September 13, 2019 at 10:39 am

గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ లో అసమ్మతి రాగం పెల్లుబికిన విషయం తెలిసిందే. వరుసగా పార్టీలోని ముఖ్య నేతలు టీఆర్ఎస్ అధిష్టానంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాత్రం ఓ అడుగు ముందుకేసి….బీజేపీ ఎంపీతో భేటీ అయ్యి టీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌తో భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది. అరవింద్ తో భేటీ అయిన అనంతరం షకీల్ టీఆర్ఎస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు టీఆర్ఎస్‌లో తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి మరి పార్టీలో ఉంటున్నాని మాట్లాడారు.

అలాగే బీజేపీలో ఎప్పుడు చేరేది త్వరలో చెబుతానని తన రాజకీయ భవిష్యత్ గురించి కీలక ప్రకటన చేశారు. అయితే ఇంత జరుగుతున్నా…టీఆర్ఎస్ మాత్రం సైలెంట్ గానే ఉంది. షకీల్ ని పార్టీ మారకుండా ఆపే ప్రయత్నాలు చేయట్లేదు. షకీల్ లాంటి నేత వెళ్లిపోతే బెటర్ అని వారు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే షకీల్ మీద ఉన్న కేసులు కారణంగానే టీఆర్ఎస్ వాళ్ళు అలా అనుకుంటున్నారు. షకీల్ బీజేపీలోకి వెళితే ఆ కేసులు మరకలు ఆ పార్టీకే అంటుకుంటాయి.

అసలు షకీల్ మీద కేసులు చాలా ఉన్నాయి. అవి కూడా అక్రమ మనుషుల రవాణా కేసులు. అన్నీ ఢిల్లీ, ముంబై ఎయిర్ పోర్టుల్లోనే నమోదైనవి. 2005లో మొదటిసారిగా మనుషుల అక్రమ రవాణా కేసులో షకీల్ పోలీసులకి పట్టుబడ్డారు. ఆ తర్వాత 2007లో ఢిల్లీ విమానాశ్రయంలో మరో కేసు నమోదైంది. అదే ఎయిర్ పోర్టులో 2013లో తీవ్రమైన ఓ నేరంలో దొరికారు. ఇక ఆయన మీద అన్ని నేరాల్లో 420,471 సెక్షన్లు, రెండు కేసుల్లో 120బి సెక్షన్ ఉంది. ఇవన్నీ ఆయన ఎన్నికల అఫడవిట్ లో తెలిపిన కేసులే.

అందుకే రేవంత్ రెడ్డి లాంటి నాయకులు కేసీఆర్ తో సహ కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై అక్రమ మనుషుల రవాణా కేసులు ఉన్నాయని అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేస్తుంటారు. అయితే ఇప్పుడిప్పుడే తెలంగాణలో ఎదగడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ… ఈ కేసులని ఆయుధంగా చేసుకుని టీఆర్ఎస్ ని ఇరుకున పెట్టడానికి చూస్తున్నారు. అందులో భాగంగా షకీల్ ని త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశముందని ప్రచారం జరుగుతుంది.

ఈ నేపథ్యంలో షకీల్ బీజేపీ ఎంపీతో కలిసి టీఆర్ఎస్ పై విమర్శల బాణాలు వదిలారు. బీజేపీలోకి వెళుతున్నాని సిగ్నల్స్ ఇచ్చారు. అటు టీఆర్ఎస్ కూడా షకీల్ విషయంలో స్పందించలేదు. షకీల్ బీజేపీలోకి వెళితే ఈ కేసులు గోల ఉండదని భావిస్తున్నారు. పైగా షకీల్ బీజేపీలో చేరినా…టీఆర్ఎస్ అనర్హత వేటు కూడా వేయదని తెలుస్తోంది. మొత్తం మీద షకీల్ టీఆర్ఎస్ కు షాక్ ఇవ్వడం వెనుక ఇన్ని కేసులు ఉన్నాయనమాట.

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వెనుక ఇంత క్రైమ్ ఉందా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts