వాల్మీకి బ్యాన్‌తో ఒక్క‌ట‌వుతున్న టాలీవుడ్‌…!

September 21, 2019 at 11:48 am

అది సినిమా.. జీవితం కాదు.. కానీ కొన్ని జీవితాల సంఘ‌ట‌న‌ల‌ను ఓ క‌థ‌గా తీసుకుని వాటిలో మంచి చెడుల‌ను ప్ర‌స్థావిస్తూ.. దానికి కొంత కాల్ప‌నికత‌కు జోడించి, హాస్యం, దుఃఖంతో పాటు న‌వ‌ర‌సాల‌ను క‌లిసి మేళ‌వించి వ‌డ్డించేదే సినిమా. అయితే ఈ సినిమాను కేవ‌లం ఓ వినోదం పంచే సాధ‌నాలుగా చూడాలి. కానీ ఇప్పుడు కొంద‌రు వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల కోసం క‌థ‌లో మా కులాన్ని కించ‌ప‌రిచార‌ని, లేదా మా మ‌తాన్ని దిక్క‌రించార‌ని, మా కుల దైవాన్ని అవ‌మాన ప‌రిచారని అపోహ‌లు లేపుతూ ఘ‌ర్ష‌ణ‌ల‌కు పాల్ప‌డుతున్నారు..

ఇలా కావ‌డానికి కార‌ణం మ‌నుషుల ఆలోచ‌న‌ల్లో పెరిగిన భావ దారిద్య్రంగానే చెప్ప‌వ‌చ్చు. అయితే ఇటీవ‌ల కాలంలో టాలీవుడ్‌లో ఇలా వ్య‌తిరేక భావ‌న‌లు, అన్య‌ధోర‌ణ‌లు బాగా పెరిగిపోయాయి. గ‌తంలో ఓ సినిమాలో మా బ్ర‌హ్మ‌ణుల‌ను కించ‌ప‌రిచేలా పాట‌లు పెట్టార‌ని, వీటిని వెంట‌నే తొల‌గించాల‌ని కొంద‌రు బ్రాహ్మ‌ణులు నిర‌స‌న తెలిపారు. ఇప్పుడు వాల్మీకి చిత్రం లో కూడా ఇదే జ‌రిగింది. సినిమాకు వాల్మీకి అనే టైటిల్ పెట్ట‌డం కొంద‌రికి కంట‌గింపుగా మారింది..

వాస్త‌వానికి వాల్మీకి అనే పేరుతో వ‌చ్చిన చిక్కేమి లేదు.. వాల్మీకి ఇందులో కించ‌ప‌రిచింది లేదు.. మ‌రి ఎందుకు ఇలా జ‌రిగింది.. అంటే ఇందులో రాజ‌కీయ కోణం దాగుంద‌నే అర్థ‌మ‌వుతుంది. అస‌లు ఇలా అయితే భ‌విష్య‌త్‌లో సినిమాలు వ‌స్తాయా.. అనాధిగా ఓ వ‌ర్గం ప్ర‌జ‌ల‌ను కించ‌ప‌రుచుతూ అనేక సినిమాలు వ‌స్తున్నాయి.. మ‌రి వాటిపై ఈ రాజ‌కీయ నాయ‌కులు ఎందుకు ప్ర‌శ్నించ‌రు.. మ‌రి ఇప్పుడు ఈ వాల్మీకి సినిమా కోస‌మే ఎందుకు ఇలా వివాదాలు సృష్టిస్తున్నారు..
ఇలా అయితే భ‌విష్య‌త్‌లో టాలీవుడ్ లో రాబోయే ప్ర‌తి చిత్రంలో ఏదో ఓ స‌మ‌స్య‌ను సాకుగా చూపి సినిమా పేర్లు, క‌థ‌లు, పాట‌లు బ్యాన్ చేయ‌వ‌చ్చ‌న్న మాట‌. ఈ విష‌యం సెన్సార్ స‌భ్యుల‌కు తెలియ‌దా.. వారు ఎందుకు ఓకే చెపుతున్నారు.. వీళ్ళేందుకు రాద్ధాంతం చేస్తున్నారు.. సో టాలీవుడ్ అంతా ఏక‌తాటిపై నిలిచి వాల్మీకికి జ‌రిగిన అన్యాయం మ‌రో సినిమాకు జ‌రుగ‌కుండా జాగ్ర‌త్త ప‌డాలి లేకుంటే కొంద‌రు త‌మ స్వార్థ ప్ర‌యోజ‌నాల‌కు వినోద రంగం దెబ్బ‌తిన‌డం ఖాయం..

వాల్మీకి బ్యాన్‌తో ఒక్క‌ట‌వుతున్న టాలీవుడ్‌…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts