వాల్మీకి టైటిల్ వివాదం కేంద్రం చెంత‌కు..!

September 12, 2019 at 3:40 pm

వాల్మీకి అనే ఓ ప్రాంతీయ భాషా చిత్రంగా తెర‌కెక్కుతుంది. అయితే ఇప్పుడు ఇది ప్రాంతీయ చిత్రంగా టాలీవుడ్‌లో తెర‌కెక్కుతుంటే.. దీనిపై వివాదం మాత్రం కేంద్రం చెంత‌కు చేరింది. ఓ ప్రాంతీయ చిత్ర వివాదాన్ని కేంద్ర‌మంత్రికి విన్న‌వించ‌డం అంటే.. ఆ సినిమాకు ఎంత‌టి పాపులారిటి ఉందో అర్థ‌మ‌వుతుంది. ఇంత‌కు ఈ చిత్రం టైటిల్ గురించి ఇంత వివాదం అవ‌స‌ర‌మా.. అంటే అవ‌స‌ర‌మే అంటున్నారు.. వాల్మీకి కుల వంశ‌స్తులు బోయ‌కుల‌స్తులు.

మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ హీరోగా న‌టిస్తున్న చిత్రం వాల్మీకి. ఈ సినిమా టైటిల్‌పై గ‌త కొంత‌కాలంగా అనేక వివాదాలు న‌డుస్తున్నాయి. ఏకంగా చిత్ర యూనిట్ జ‌రుపుతున్న షూటింగ్ ప్రాంతానికి వెళ్లి ఆందోళ‌న చేశారు. అంత‌టితో ఆగ‌కుండా చిత్ర టైటిల్‌ను మార్చ‌క‌పోతే ఎంతకైనా పోరాడుతామ‌ని బోయ‌కుల‌స్తులు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేస్తున్నారు. బీసీ సంఘాలు కూడా బోయ‌కుల‌స్తుల ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తు ప‌లికారు. బీసీ సంఘాల జాతీయ అధ్య‌క్షుడు ఆర్ కృష్ణ‌య్య సినిమా టైటిల్ మార్చాల‌ని హెచ్చ‌రించాడు.

అయినా బెద‌ర‌ని చిత్ర యూనిట్ టైటిల్‌ను అలాగే ఉంచింది. ఇప్పుడు బోయ‌కుల‌స్తులు అనంత‌పురం ఎంపి త‌లారి రంగ‌య్య‌తో క‌లిసి కేంద్ర‌మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్‌ను క‌లిసి సినిమా టైటిల్ మార్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని లేకుంటే సినిమాను నిషేదించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. దీనికి తోడు కేంద్ర సెన్సార్ బోర్డు కార్యాల‌యం ముందు విశ్వ‌హిందు ప‌రిష‌త్‌, భ‌జ‌రంగ్‌ద‌ళ్ నాయ‌కులు ధ‌ర్నా చేయ‌డం, సెన్సార్ బోర్డుకు లేఖ రాయ‌డం విశేషం. అయితే సినిమాలో హీరోపేరు వాల్మీకి కాద‌ని, ఎలాంటి వివాదాలు లేవ‌ని ద‌ర్శ‌కుడు హ‌రీష్‌శంక‌ర్ చెపుతున్నా విన‌డం లేదు.. సో ఇప్పుడు వాల్మీకి టైటిల్ వివాదం కేంద్రమంత్రి దృష్టికి వెళ్ళిన నేప‌థ్యంలో ఎలాంటి మ‌లుపులు ఉంటాయో వేచి చూడాల్సిందే..

వాల్మీకి టైటిల్ వివాదం కేంద్రం చెంత‌కు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts