వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ‌…!

September 17, 2019 at 2:44 pm

రౌడీ హీరో ఇప్పుడు వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌గా మారాడా.. ప్ర‌పంచంలో ఉన్న అంద‌రిని ఇత‌డు ప్రేమిస్తాడా.. లేక కేవ‌లం ప్ర‌పంచంలో ఉన్న అంద‌మైన అమ్మాయిల‌నే ప్రేమిస్తాడా అనేది ఇప్పుడు క‌లుగుతున్న సందేహం. అర్జున్‌రెడ్డి సినిమాతో యూత్‌తో క‌నెక్ట్ అయిన రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడు వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌గా అవ‌తారం ఎత్తుతున్నాడు.. తాను న‌టించ‌బోతున్న సినిమాకు పెట్టిన ఏంటో తెలుసా.. తెలిస్తే మీరు షాక్ కావాల్సిందే..

విజయ్ దేవరకొండ, దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి చాలా గమ్మత్తైన టైటిల్ ని అనౌన్స్ చేశారు. వరల్డ్ ఫేమస్ లవర్ అనే టైటిల్ తో విజయ్ మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ పాత్ర చాలా కొత్తగా ఉండబోతున్నందట. విజయ్ నలుగురు అమ్మాయిలని ప్రేమిస్తాడట. అందుకే ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు న‌టిస్తున్నారు. టైటిల్ కార్డులో న‌లుగురు హీరోయిన్ల పేర్ల‌ను ప్ర‌ముఖంగా పేర్కోన్నారు.

క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె యస్ రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఈసారి తన ప్రేమని విశ్వవ్యాప్తం చేయాలని అనుకుంటున్నాడని అంటున్నారు. విజయ్ దేవ‌ర‌కొండ సరసన రాశీ ఖన్నాతో పాటుగా ఐశ్వర్య రాజేష్, కేథరిన్ థెరీసా, ఇసబెల్ల నటిస్తున్నారు. అర్జున్‌రెడ్డితోనే టాలీవుడ్‌ను షేక్ చేసిన ఈ రౌడీ హీరో ఇప్పుడు వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌గా ఎలా ఆక‌ట్టుకుంటాడో చూడాలి మ‌రి.

వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ‌…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts