సీఎం ర‌మేష్‌పై జ‌గ‌న్ వేటు.. ఇక కోలుకోవ‌డం క‌ష్ట‌మే..

September 4, 2019 at 4:06 pm

సీఎం ర‌మేష్‌. క‌డ‌పకు చెందిన టీడీపీ కీల‌క నాయ‌కుడు. ముఖ్యంగా క‌డ‌ప ఉక్కు ఫ్యాక్ట‌రీ కోసం ఆయ‌న కొన్ని రోజులు నిరాహార దీక్ష కూడా చేసి ప్ర‌త్యేకంగా గుర్తింపు సాధించారు.రెండు సార్లు రాజ్య‌స‌భ‌కు ఎన్నిక య్యారు. అయితే, రాష్ట్రంలో అధికార పార్టీ మారిపోవ‌డంతో ఆయ‌న త‌న వ్యాపారాల‌కు ఇబ్బంది క‌లుగుతుంద‌ని, తాను ఇంటా బ‌య‌టా కూడా టార్గెట్ అవుతాన‌ని(అప్ప‌టికే బీజేపీ నుంచి బెదిరింపులు, సీబీఐ,ఐటీ దాడుల‌తో ఉక్కిరి బిక్కిరి అయ్యారు) గ్ర‌హించి టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిపోయారు. దీంతో తాను ఒడ్డున ప‌డ్డాన‌ని అనుకున్నారు.

మొత్తానికి పార్టీనే బీజేపీలో విలీనం చేసే ప్ర‌తిపాద‌న తెచ్చారు. స‌రే! అంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. రాష్ట్రంలో మాత్రం త‌న‌ను తాను కాపాడుకోలేక పోయారు. చంద్ర‌బాబు హ‌యాంలో త‌మ్ముళ్ల‌కు జ‌రిగిన పందేరంలో సీఎం ర‌మేష్‌కు కూడా బాగానే ముట్ట‌జెప్పారు బాబు గారు. సీమ‌కు నీళ్లందించే గాలేరు-న‌గ‌రి ప్రాజెక్టు కు సంబంధించి రుత్విక్ సంస్థ‌(సీఎం ర‌మేష్‌కు చెందిన సంస్థ‌) బారీ కాంట్రాక్టును క‌ట్ట‌బెట్టారు. నిజానికి చాలా ర‌హ‌స్యంగా ఈ టెండ‌ర్ ప్ర‌క్రియ సాగింది.

మొత్తం 740 కోట్ల పైచిలుకు ప‌నుల‌ను గాను 430 కోట్ల ప‌నుల‌కు సంబంధించి రిత్విక్ సంస్థ‌కు ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు కాంట్రాక్టు అప్ప‌గించింది. దీనిలో అనేక లోపాలు ఉన్న‌ప్ప‌టికీ.. అప్ప‌టి ప్ర‌భుత్వం మేలు చేయాల‌నే ఉద్దేశంతోనే గాలేరు-న‌గ‌రి కుడికాల్వ ప‌నుల‌ను సీఎం ర‌మేష్‌కు చెందిన సంస్థ‌కు అప్ప‌గించారు. అయితే, వృధా చేసిన ప్ర‌జాధ‌నాన్ని తిరిగి ఖ‌జానాకు ర‌ప్పిస్తామ‌నే వాగ్దానం చేసిన సీఎం జ‌గ‌న్ ఇప్పుడు గ‌త టెండ‌ర్ల‌పై రివ్యూ చేప‌ట్టారు. దీనిలో భాగంగా గాలేరు న‌గ‌రిలో జ‌రిగిన టెండ‌ర్ల అక్ర‌మాల‌పై కూడా దృష్టి పెట్టారు.

ముఖ్యంగా సీఎం ర‌మేష్‌కు ఏ ప్రాతిప‌దిక‌న దీనిని క‌ట్ట‌బెట్టారో గ‌డిచిన నెల రోజులుగా అధ్యయనం చేయించారు. దీంతో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఈ టెండ‌ర్‌ను ఏ ప్రాతిప‌దికా లేకుండానే క‌ట్ట‌బెట్టిన వైనం తెలుసుకుని దీనిని ర‌ద్దు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే రివ‌ర్స్ టెండ‌ర్ కు ఆహ్వానిస్తూ.. తాజాగా కేబినెట్ కూడా తీర్మానం చేసింది. దీంతో సీఎం ర‌మేష్‌కు ద‌ఖ‌లు ప‌డిన 430 కోట్ల‌ను ప్ర‌భుత్వం ప‌నులు పోను మిన‌హా సొమ్మును ర‌క‌వ‌రి చేయ‌నుంది. మొత్తానికి దీంతో సీఎం ర‌మేష్ చిక్కుల్లో ప‌డ్డార‌ని అంటున్నారు ఆయ‌న అనుచ‌రులు.

సీఎం ర‌మేష్‌పై జ‌గ‌న్ వేటు.. ఇక కోలుకోవ‌డం క‌ష్ట‌మే..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts