ఎట్ట‌కేల‌కు వెన‌క్కు త‌గ్గిన జ‌గ‌న్‌…

September 12, 2019 at 12:36 pm

సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది మొదలు….గత టీడీపీ ప్రభుత్వ చేసిన అవినీతిని వెలికితీస్తామని ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా గత ప్రభుత్వం చేసుకున్న పలు ఒప్పందాలని రద్దు చేస్తూ…పునఃసమీక్షాలు చేస్తూ ముందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే విద్యుత్ పీపీఏలని రద్దు చేయడానికి జగన్ ప్రభుత్వం సిద్ధమైంది. గత ప్రభుత్వం పలు సంస్థల నుండి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేస్తుందని చెబుతూ…వాటిని రద్దు చేయడానికి చూశారు.

అందుకు తగ్గట్టుగానే దీనిపై ప్రత్యేక కమిటీని నియమించారు. విద్యుత్ కంపెనీల ప్రతినిధుల్ని పిలిపించి…. ధరలు తగ్గించాలని హెచ్చరిక ధోరణిలో చెప్పి చూశారు. వారు వినకపోవడంతో కరెంట్ కొనుగోళ్లు ఆపేశారు. ఆ తర్వాత కొన్ని కంపెనీలకు.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న లేఖలు పంపారు. అయితే విద్యుత్ పీపీఏలని రద్దు చేయొద్దని ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది.

ఏపీ సీఎం తీరు దేశంలోకి వస్తున్న పెట్టుబడుల వాతావరణాన్ని దెబ్బతీస్తుందని…కేంద్ర ప్రభుత్వం సీరియస్ అవుతూ.. పలుమార్లు లేఖల ద్వారా హెచ్చరికలు పంపింది. అయినా గానీ తమకు మోడీ, అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయని, వాళ్లకు చెప్పే అంతా చేస్తున్నామంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఏ రేంజ్ లో ఫైర్ అయ్యారో అందరికీ తెలుసు.

మొత్తానికి అయితే కేంద్రం ఎన్ని రకాలుగా చెప్పిన జగన్ వెనక్కి తగ్గలేదు. కానీ తాజాగా విద్యుత్ పీపీఏల విషయంలో ప్రధాని మోడీ కూడా సీరియస్ అయ్యారని, కేంద్రం నుంచి తీవ్రమైన హెచ్చరికలే ఏపీ ప్రభుత్వానికి అందినట్లుగా ప్రచారం జరిగింది. దీంతో జగన్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తాము టీడీపీ హయంలో జరిగిన విద్యుత్ పీపీఏల అగ్రిమెంట్ల జోలికి వెళ్లబోమని, చెబుతూ కేంద్రానికి తాజాగా జగన్ ఓ లేఖ పంపారు. కానీ అవినీతికి ఆధారాలు ఉంటే మాత్రమే, పీపీఏలపై ముందుకు వెళతామని ఆ లేఖలో చెప్పుకొచ్చారు.

అలాగే తాము నిర్ణయించిన ధరని ఇక నుంచి చేసుకోబోయే ఒప్పందాలకు మాత్రమే పరిమితం చేస్తామని కేంద్రానికి రాసిన లేఖలో జగన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తం మీద మొదట్లో విద్యుత్ పీపీఏల విషయంలో పట్టుబట్టిన జగన్…చివరికి కేంద్రానికి తలోగ్గారు.

ఎట్ట‌కేల‌కు వెన‌క్కు త‌గ్గిన జ‌గ‌న్‌…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts