ఈ గెలుపు గెలుపే కాదు ..వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు !

September 6, 2019 at 3:20 pm

వైసీపీ ఇప్పుడు గెలిచిన గెలుపు కాదా? 151 స్థానాల‌ను కైవ‌సం చేసుకుని అప్ర‌తిహ‌త మెజార్టీ సాధించుకు న్నా.. ఆ పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌లో ఆ మేర‌కు సంతృప్తి క‌నిపించ‌డం లేదా? అస‌లు ఇది విజ‌య‌మే కాదు.. అని ఆయ‌న భావిస్తున్నారా? అంటే.. సీఎం పేషీ స‌హా జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితులుగా ఉండే వారి సూచ‌న‌ల మేర‌కు ఔన‌నే తెలుస్తోంది. గ‌తంలో ఎన్న‌డూ క‌నీ వినీ ఎరుగ‌ని విధంగా జ‌గ‌న్ పార్టీ .. రాష్ట్రంలో 151 అసెంబ్లీ, 22 మంది ఎంపీల‌తో అత్య‌ధిక మెజార్టీ పార్టీగా అవ‌త‌రించింది. అంతేకాదు, 49.99 శాతం ఓట్ల షేర్‌ను కూడా సాధించి గ‌త రికార్డుల‌ను తిర‌గ‌రాయ‌డం లేదా చ‌రిత్ర సృష్టించ‌డ‌మో చేసింది.

మ‌రి ఇంత చేసినా.. రాష్ట్రంలో నూత‌న అధ్యాయం సృష్టించినా.. జ‌గ‌న్ సంతృప్తి చెంద‌డం లేదా? అం టే.. ఔన‌నే అంటున్నారు ఆయ‌న‌కు అత్యంత స‌న్నిహితంగా ఉండే ఒక‌రిద్ద‌రు నాయ‌కులు. సాధించిన దానికి సంతృప్తిని చెంది.. ఇదే విజ‌య‌మనుకుంటే.. స‌రిపోదోయి! అని జ‌గ‌న్ త‌న అనుకున్న వారి ద‌గ్గ‌ర చెబుతున్నార‌ని స‌మాచారం. ఇప్పుడు ఎన్నిక‌ల్లో ఇంత విజ‌యం సాధించ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయ‌ని ఆయ‌న‌చెబుతున్నార‌ట‌. అది చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై ఉన్న వ్య‌తిరేక‌త కావొచ్చు. త‌న పాద‌యాత్ర కావొచ్చు. క్షేత్ర‌స్థాయిలో టీడీపీ నేత‌ల దోపిడీ కూడా కావొచ్చ‌ని. ఈ కార‌ణాల నేప‌థ్యంలోనే వైసీపీకి ప్ర‌జ‌లు ప‌ట్టం గ‌ట్టార‌ని జ‌గ‌న్ భావిస్తున్నార‌ట‌.

కానీ, వ‌చ్చే 2024 ఎన్నిక‌లే వైసీపీకి అస‌లు సిస‌లు ఎన్నిక‌ల‌ని తాజాగా అమెరికా నుంచి వ‌చ్చిన త‌ర్వాత త‌న అనుకున్న‌వారితో జ‌గ‌న్ చేసిన రివ్యూలో ఇదే అభిప్రాయం వెల్ల‌డించార‌ట‌. ప్ర‌స్తుత విజ‌యం చూసు కుని పొంగిపోతే.. ఇబ్బందులు ప‌డాల‌ని అంద‌రికీ సూచించాల‌ని వారిని ఆదేశించిన‌ట్టు స‌మాచారం. వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో ఇలానే విజ‌యం సాధించాల‌ని, అప్పుడే వైసీపీ నిజ‌మైన ప్ర‌జ‌ల పార్టీగా గుర్తింపు ద‌క్కించుకున్న‌ట్ట‌ని జ‌గ‌న్ చెబుతున్నార‌ట‌. ప్ర‌భుత్వ పాల‌న‌, సంక్షేమం, మేనిఫెస్టో.. న‌వ‌ర‌త్నాలు వంటివాటిని పూర్తిగా అమ‌లు చేయ‌డంతోపాటు..ఎక్క‌డా అవినీతి అనేది లేకుండా చేసుకుని ముందుకు వెళ్తే.. వ‌చ్చే గెలుపే అస‌లు సిస‌లైన విజ‌యంగా జ‌గ‌న్ అభివ‌ర్ణిస్తున్న‌ట్టు చెబుతున్నారు.

ఈ గెలుపు గెలుపే కాదు ..వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts