ఏపీ కేబినెట్ నిర్ణయాలు : ‘ఆశా’ల పండగ

September 4, 2019 at 2:57 pm

జగన్మోహన రెడ్డి కేబినెట్ భేటీ బుధవారం జరిగింది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో ఆశా వర్కర్లకు వేతనాలు పెంచే నిర్ణయం కీలకమైనది. ఆశా వర్కర్లకు వరం ప్రసాదించినట్లుగానే.. వారి వేతనాన్ని 3000 నుంచి ఒకేసారి పదివేలకు పెంచుతూ జగన్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై ఆశా వర్కర్లు పండగ చేసుకుంటున్నారనడంలో సందేహం లేదు.

ఆశా వర్కర్లకు ఏడాది కిందట కేవలం 1500 రూపాయల వేతనం మాత్రమే ఉండేది. జగన్మోహన రెడ్డి తన పాదయాత్రలో భాగంగా.. ఆశా వర్కర్లకు గట్టి హామీ ఇవ్వడంతో… చంద్రబాబు సర్కారులో అప్పట్లో కాస్త చలనం వచ్చింది. వారి వేతనాలను 2018 ఆగస్టులో 1500 నుంచి 3000కు పెంచారు. ప్రతిభగా ఆధారంగా మరో 3000 వరకు ఇస్తాం అంటూ అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. అయితే జగన్ అధికారంలోకి రాగానే.. వారి వేతనాలను 3000 నుంచి ఒకేసారి 10000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని బుధవారం నాటి కేబినెట్ భేటీ ఆమోదించింది.

ఈ మద్య కాలంలోనే.. ఆశా వర్కర్లు, జగన్ శవయాత్ర నిర్వహిస్తున్నారంటూ తప్పుడు ఫోటోలతో ప్రభుత్వం గురించి విషప్రచారం చేయడానికి చంద్రబాబునాయుడు పూనుకున్నారు. ఆశా వర్కర్లకు వేతనాలు పెంచడంలో మీనమేషాలు లెక్కించిన చంద్రబాబు.. జగన్ మీద… ఆశా వర్కర్లు ఆగ్రహంగా ఉన్నారంటూ ఒక దుష్ప్రచారం సాగించే ప్రయత్నం చేశారు. ఆయన తన ట్వీట్లలో పెట్టినవి తప్పుడు ఫోటోలు అని సోషల్ మీడియా గుర్తించి.. చంద్రబాబు మీద ఎదురుదాడికి దిగగానే.. ఆయన నాలిక్కరుచుకుని.. ట్వీట్లను డిలిట్ చేసేసి… అభాసుపాలయ్యారు.

ఆశావర్కర్లలో ఆనందోత్సాహాలు నిండేలాగా.. జగన్ సర్కారు వేతనాల పెంపు నిర్ణయానికి కేబినెట్ ఆమోద ముద్ర కూడా వేసేసింది.

దీనితోపాటు పోలవరం టెండర్ల రద్దు నిర్ణయం, కాంట్రాక్టర్ల నుంచి ఎడ్వాన్సులు రికవరీ చేయాలని నిర్ణయం, మావోయిస్టులపై ఏడాది నిషేధం పొడిగింపు, బందరు పోర్టుకు కేటాయించిన 412 ఎకరాల భూమిని వెనక్కు తీసుకునే నిర్ణయాలకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

ఏపీ కేబినెట్ నిర్ణయాలు : ‘ఆశా’ల పండగ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts