జ‌గ‌న్ స‌ర్కారును నడుపుతోన్న ‘అజ్ఞాతవాసి’ ఆయనే !

September 30, 2019 at 11:49 am

దివంగ‌త నేత‌ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి.. ఈ పేరుకు ప‌రిచ‌యం అక్క‌ర‌లేదు.. ఏపీలో రాజ‌కీయాల‌ను శాసించిన ఈ దివంగ‌త నేత బ‌తికున్నంత కాలం ఏది చేసినా అది జనామోద‌మే అనేది సుస్ప‌ష్టం. ప్ర‌తిప‌క్ష నేత‌గా ఆయ‌న సాగించిన పాద‌యాత్ర చ‌రిత్ర సృష్టించింది. సీఎంగా ప‌నిచేసినంత కాలం ఆయ‌న ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాలు నేటికి ప్ర‌తి పాల‌కుడికి మార్గ‌ద‌ర్శ‌నం చేస్తూనే ఉన్నాయి. ఆయ‌న పాల‌న రాజుల కాలంలో సాగిన విధంగా సాగింద‌నేది ప్ర‌తీతి. గుప్త‌దానాలు చేయ‌డంలో ఆయ‌న చేతికి ఎముక‌లేద‌ని అంటారు. ప్ర‌జా సంక్షేమం కోసం ఆయ‌న చేప‌ట్టిన ప్రతి ప‌థ‌కం ఓ సంచ‌ల‌నమే.

అలా ఉన్న‌వాడికి లేనివాడికి అనే తేడా లేకుండా అంద‌రిని ఎవ‌రి స్థాయిలో వారిని త‌న ప‌రిపాల‌న‌తో మెప్పించిన ఘ‌నాపాటి రాజ‌కీయం ఆయ‌న‌ది. మ‌రి ఆయ‌న బ‌తికున్నంత కాలం, ప‌రిపాల‌న సాగించినంత కాలం ఆయ‌న వెంటున్న ఆత్మ, ఆయ‌న దివంగతులు కాగానే ఏమైంది అనేది ఓ ప్ర‌శ్న‌. మ‌రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి చ‌నిపోగానే ఆయ‌న ఆత్మ ఆయ‌న కొడుకును తెర‌వెనుకుండి న‌డిపిస్తుందా..? అస‌లు వైఎస్ ఆత్మ త‌న కుమారుడికి తోడు నీడ‌గా ఎక్క‌డ క‌నిపించ‌డం లేదే అనేది ప్ర‌జాక్షేత్రంలో కనిపించ‌డం లేదేమీ…? అనేది సామాన్య జ‌నం మాట‌. కాదు వైఎస్ చనిపోగానే వైఎస్ వెంట ఉన్న ప్ర‌తి ఒక్క‌ ఆత్మ‌, అంత‌రాత్మ‌లు మాయ‌మ‌యి పోయాయి.

జ‌గ‌న్‌ను ఒంట‌రిని చేసి ఎక్క‌డికి పారిపోయాయి.. అంటే అవి ఎక్క‌డ పోలేదు.. వైఎస్ ఆత్మ కూడా జ‌గ‌న్ కు తోడు నీడ‌గా తెర‌వెనుక నిల‌బ‌డింద‌ట‌.. అందుకు ఇదిగో సాక్ష్యాలు అంటూ అదే ఆత్మ బ‌య‌ట ప‌డింది.. అంతే కాదు.. వైఎస్ ఆత్మే ఇప్పుడు జ‌గ‌న్‌కు అన్ని తానే తెర‌వెనుకుండి న‌డిపిస్తుంద‌ట‌.. ఇంత‌కు ఈ ఆత్మ ఎక్క‌డిది.. ఎవ‌రి ఆత్మ‌.. అస‌లు ఆత్మ‌లు జ‌గ‌న్‌ను న‌డుపుడేంది అనుకుంటున్నారా.. అదేనండి వైఎస్ ఆత్మ అంటే కేవీపీ రామచంద్ర‌రావు.

కేవీపీ రామ‌చంద్ర‌రావు వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆత్మ‌గా ఉండి అన్ని తానై న‌డించిన నేత‌. వైఎస్ చ‌నిపోగానే ఆయ‌న అదే కాంగ్రెస్‌లో ఉండిపోయారు. కానీ జ‌గ‌న్ కాంగ్రెస్‌లో ప‌డ్డ క‌ష్టాల‌ను, సొంత పార్టీ పెటుకున్న‌ప్పుడు ప‌డిన బాధ‌లు, జైలుకు పోయిన‌ప్పుడు ప‌డిన వేధ‌న‌లో కేవీపీ రామ‌చంద్ర‌రావు నుంచి క‌నీస ఓదార్పు లేద‌ని వైఎస్ అభిమానులు కేవీపీని ఆడిపోసుకున్నారు. అయితే కేవీపీ మాత్రం జ‌గ‌న్‌కు జ‌రుగుతున్న ప్ర‌తి స‌న్నివేశంలోనూ తోడు నీడ‌గా తెర‌వెనుకుండి న‌డిపిస్తున్న‌ట్లు తేట‌తెల్లం అయింది. అది స్వ‌యానా కేవీపీ రామ‌చంద్రారావు ప్ర‌క‌టించి సంచ‌ల‌నం లేపాడు. కాంగ్రెస్ రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న కేవీపీ జ‌గ‌న్‌ను మేన‌ల్లుడిగా భావిస్తార‌ట‌.

అందుకే జ‌గ‌న్ సీఎం కాగానే అభినందించ‌డానికి కేవీపీ కుటుంబ స‌మేతంగా జ‌గ‌న్‌ను క‌లిసి అభినంద‌నలు తెలిపాడు. ఇక ఓ సంద‌ర్భంలో నేను జ‌గ‌న్‌నుకు మేన‌మామ‌ను, జ‌గ‌న్ నాకు మేన‌ల్లుడు.. మా ఇద్ద‌రి బంధం ఎప్పుడు గ‌ట్టిగానే ఉంటుంది.. అవ‌స‌ర‌మైన‌ప్పుడు నేను జ‌గ‌న్ ప‌క్క‌నే ఉంటాను అంటూ కామెంట్ చేశాడు. ఇలా నిరూపిత‌మైన ఇద్ద‌రి మ‌ద్య ప్రేమ‌, అనురాగాలు, ఆపాయ్య‌త‌లు, మ‌మ‌కారాలు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉండ‌నే ఉన్నాయ‌నే టాక్‌. జ‌గ‌న్ అధికారంలోకి రాగానే జాతీయ స్థాయిలో చ‌క్రం తిప్పుతూ, జ‌గ‌న్ స‌ర్కారుకు, వ్య‌క్తిగ‌తంగా స‌ల‌హాలు సూచ‌న‌లు చేస్తూ తెర‌వెనుక ఆత్మ‌గా ప‌నిచేస్తున్నాడ‌ట కేవీపీ.

ఆత్మ‌గా ప‌నిచేస్తున్న కేవీపీ పోల‌వరంలో జ‌రుగుతున్న అవినీతిని బ‌య‌ట‌పెట్ట‌డంలో, రివ‌ర్స్ టెండ‌రింగ్‌లో, ఓ సంస్థ‌కు కాంట్రాక్ట్ ఇప్పించ‌డంలో అంతా ఆత్మే వెనుకుండి న‌డిపిస్తుంద‌ట‌. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్‌తో జ‌గ‌న్‌కు స‌న్నిహిత సంబంధాలు నెర‌ప‌డంలోనూ ఈ ఆత్మ ప‌నేన‌ట‌. ఎందుకంటే కేవీపీ రామచంద్రారావుది, కేసీఆర్ ఇద్దరి సామాజిక‌వ‌ర్గం ఒక్క‌టే. ఇద్ద‌రు వెల‌మాల కులానికి చెందిన‌వారే కావ‌డంతో కేవీపీకి, కేసీఆర్‌కు బంధం బ‌లంగానే ఉంద‌ట‌. దీనికి తోడు మామ అని కేవీపీని పిలిచే జ‌గ‌న్‌కు ఆత్మ‌గా మారిన కేవీపీ, ఇటు కేసీఆర్‌తో సంబంధాలు నెరిపి రెండు రాష్ట్రాల న‌డుమ స‌త్సంబంధాలు నెరుపుతున్నాడ‌ట‌. ఇలా కేవీపీ రామ‌చంద్ర‌రావు నాడు తండ్రికి, నేడు త‌న‌యుడికి ఆత్మ‌గా మారి బ‌ల‌మైన శ‌క్తిగా అవ‌త‌రిస్తున్నాడ‌ట‌.. !

జ‌గ‌న్ స‌ర్కారును నడుపుతోన్న ‘అజ్ఞాతవాసి’ ఆయనే !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts