జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న జగన్ సర్కార్

September 27, 2019 at 10:53 am

ఏపీ సీఎం జ‌గ‌న్ దూకుడు పెంచారు. ఓట‌మి నుంచి పాఠాలు నేర్చుకున్న ఆయ‌న ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో విమర్శలు ఎదుర్కున్న అంశాల్లోనే విజయం సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. విమర్శలు, ఎదురుదెబ్బల నుంచి అభినందనలు అందుకునే స్థాయికి ఎదిగారు. ఇటీవల చోటుచేసుకున్న ప‌లు ఘటనలు ప్రభుత్వానికి మంచి జోష్‌ని తీసుకు వస్తున్నాయి. మొదట్లో కాస్త తడబడిన‌ట్లు క‌నిపించినా.. ఈ మధ్య కాలంలో జగన్ సర్కార్ జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తోంది. పాజిటివ్ వేవ్ సంపాదించే దిశగా అడుగులు వేస్తోంది.

నిర్ణయాల అమలులో కాస్త అడ్డంకులు వచ్చినా వాటంతట అవే తొలగిపోయి విజయం దిశగా ముందుకు సాగుతోంది ప్ర‌భుత్వం. సీఎం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రివర్స్ టెండరింగ్ విధానం ఘ‌న వి జ‌యం సాధించింది. పోలవరం ప్రాజెక్టుతో ప్రారంభమైన ఈ విధానం అనుకున్న దానికంటే ఎక్కువ ఫ లితాలను ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు రీ టెండర్ల పక్రియలో దాదాపు 838 కోట్ల రూపాయలు ఆదా అ య్యాయి. దీంతో రివర్స్ టెండరింగ్ విషయంలో ప్రభుత్వం పూర్తి స్థాయి సంతృప్తికరంగా ఉంది. ఈ అం శంపై అనేక విమర్శులు వచ్చినా సీఎం జగన్ వెనకడుగు వేయలేదు.

ఇక పీపీఏల పున సమీక్షను సీఎం ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు. గత ప్రభుత్వం పీపీఏల విషయంలో భారీ అవినీతికి పాల్పడిందని వాటిని పునసమీక్షించి అదాయం అదా చేయాలని జగన్ భావించారు. అ యితే ఈ విషయంలో విద్యుత్ సంస్థలు న్యాయ స్థానాలను అశ్రయిండం, ఈ నిర్ణయంపై ఇక్కడి ప్ర తిపక్షంతో పాటు, కేంద్రలోని బీజేపీ సైతం విమర్శులు చేశాయి. అయితే ఈ విషయంలో కీలకంగా మారిన హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను పునఃసమీక్షకు అవకాశమే లేదన్న విద్యుత్‌కంపెనీల వాదనను హైకోర్టు తోసిపుచ్చ‌డంతో జ‌గ‌న్ స‌ర్కార్‌లో మ‌రింత జోష్ నింపింది.

మ‌రోప‌క్క గ్రామ సచివాలయం పరీక్ష విషయంలోనూ ర‌క‌ర‌కాలు ఊహాగానాలు వినిపించాయి. పేపర్ లీక్ అయిందంటూ ప్ర‌భుత్వంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చి ప‌డ్డాయి. అయితే ఈ విమర్శుల‌ను అభ్యర్ధు లు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒకేసారి లక్షా 30 వేల పోస్టుల భర్తీ చేస్తుండడంతో చాలా మందికి ఉ ద్యోగాలు వచ్చాయి. ఈ అంశం కూడా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇలా ప్ర‌భుత్వం చేప‌ట్టే ఒక్కో కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం అవుతుండ‌టంతో జ‌గ‌న్ స‌ర్కార్ మంచి ఊపుమీదుంది. త‌మ పాల‌న‌పై క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల నుంచి కూడా పాజిటివ్ టాక్ వ‌స్తుండ‌టంతో వైసీపీ నేత‌ల్లో కొత్త జోష్ క‌నిపిస్తోంది.

జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న జగన్ సర్కార్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts