దానికోసం ఆరాట పడుతున్న మెగా హీరో !

October 21, 2019 at 1:29 pm

ఒక సినిమాలో క‌నిపించిన లుక్ లో మ‌రోమారు క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నాడు ఈ మెగా హీరో.. నిత్యం కొత్త లుక్స్‌లో క‌నిపించాల‌ని అభిమానుల‌ను ఫిదా చేయాల‌ని తెగ తాప‌త్ర‌య ప‌డే ఈ హీరో కొత్త లుక్స్‌ కోసం ప‌డే క‌ష్టం అంతా ఇంతా కాద‌ట‌.. అందుకే త‌న సినిమాల్లో కొత్త‌గా క‌నిపిస్తూ అభిమానుల‌ను షాక్ గురిచేస్తుంటాడు ఈ మెగా హీరో…

ఇంత‌కు ఈ మెగా హీరో ఎవ‌రు అనుకుంటున్నారు క‌దూ.. ఆయ‌నే స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్‌. ఇప్పుడు అల్లు అర్జున్ న‌టిస్తున్న అల వైకుంఠ‌పురంలో కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. ఆ లుక్ టీజ‌ర్‌లోనూ, ఫ‌స్ట్‌లుక్‌లోనూ మ‌న‌కు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. అయితే ఈ కొత్త లుక్ కోసం బ‌న్నీ ఎంత‌కైనా శ్ర‌మిస్తాడ‌నేది అందిరికి తెలిసిందే. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ బ‌న్నీ కొత్త లుక్ కోసం ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకున్నాడ‌ని, అందుకే ఆక‌ట్టుకునే లుక్ కోసం తీవ్రంగా శ్ర‌మించి ఇప్ప‌టి లుక్‌లోకి మారాడ‌ని టాక్‌.

నాపేరు సూర్య‌లో కండ‌లు తిరిగిన లుక్‌లో క‌నిపించిన బ‌న్నీ అల వైకుంఠ‌పురంలో కొత్త లుక్ కోసం ఆయ‌న ఎన్ని కిలోలు త‌గ్గాడో తెలుసా.. నాపేరు సూర్య‌లో బ‌లిసిన బ‌న్నీ అల వైకుంఠ‌పురంలో బ‌క్క చిక్కిన బ‌న్నీగా క‌నిపించ‌డానికి దాదాపు 14కిలోలు త‌గ్గాడు. అందుకు కేటోజెనిక్ అనే స్పెషల్ డైట్‌ను చేసిన బ‌న్నీ లావు త‌గ్గి కొత్త లుక్‌లో క‌నిపిస్తున్నాడు. అంతే కాదు కొత్త‌గా హేయ‌ర్ స్టైయిల్ మార్చాడు. దీనికి తోడు రోజుకు రెండు గంట‌లు జిమ్‌లో క‌ష్ట‌ప‌డి ఇలా స్మార్ట్‌గా త‌యార‌య్యాడ‌నేది ఫిలిమ్ వ‌ర్గాల టాక్‌…

దానికోసం ఆరాట పడుతున్న మెగా హీరో !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts