అయోధ్య వివాదంలో కీల‌క మ‌లుపు…పుస్త‌కాన్ని చించేసిన ముస్లింల త‌ర‌ఫు లాయ‌ర్‌

October 16, 2019 at 1:48 pm

దేశంలో అతిపెద్ద కేసుగా.. సుదీర్ఘ కేసుగా గుర్తింపు పొందిన యూపీలోని రామ‌జ‌న్మ‌భూమి-బాబ్రీమ‌సీదు కేసులో నేడు బుధ‌వారం అత్యంత కీల‌క‌మైన ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ కేసు అనేక మ‌లుపుల త‌ర్వాత సుప్రీం కోర్టు స్వ‌యంగా విచార‌ణ చేప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. దీనిని వ‌చ్చే నెల 17లోగా పూర్తి చేయాల‌నే కృత నిశ్చ‌యంతో సుప్రీం ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ రంజ‌న్ గొగోయ్ ఉన్న విష‌యం తెలిసిందే. తాజాగా బుధ‌వారం నాటి ప‌రిణామంలో హైడ్రామా నెలకొంది.

ఉదయం నుంచే కోర్టులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తన వాదనకు మద్దతుగా హిందూ మహాసభ న్యాయవాది న్యాయస్ధానంలో చూపించిన పుస్తకంపై వివాదం నెలకొంది. పుస్తకాన్ని ముస్లిం సం స్థల తరపు న్యాయవాది చించివేయడంతో గందరగోళం ఏర్పడింది. ఇదే పరిస్థితి కొనసాగితే కోర్టు నుంచి వెళ్లిపోతామని ప్రధాన న్యాయమూర్తి హెచ్చరించారు. ఓ దశలో న్యాయవాదులకు, ప్రధాన న్యాయమూర్తి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మరోవైపు అయోధ్య వివాదంపై నేడు వాదనలు ముగియనుండటంతో సుప్రీం కోర్టు వెల్లడించే తుదితీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇక‌, ప్ర‌ధాన వివాదం విష‌యానికి వ‌స్తే.. పీవీ న‌ర‌సింహారావు హ‌యానికి ముందు నుంచే.. బీజేపీ-ఆర్ ఎస్ ఎస్ అజెండాల్లో కీల‌క‌మైన రామ‌జ‌న్మ‌భూమిలో రామాల‌యం నిర్మించాల‌నేది ప్ర‌ధాన వాద‌న‌. యూపీలోని ఈ ప్రాంతంలో రాముడు జ‌న్మించాడ‌ని, ఇక్క‌డ ఆయ‌న‌కు గుర్తుగా రామాల‌యం ఉండేద‌ని, అయితే, దీనిని త‌ర్వాత కాలంలో వ‌చ్చిన ముస్లింలు కూల‌దోసి.. ఇక్క‌డ మ‌సీదును నిర్మించార‌ని వాదించేవి. ఈ క్ర‌మంలోనే 1991లో క‌ర‌సేవ‌కులు ఇక్క‌డ మ‌సీదును కూల‌గొట్ట‌డం, త‌ర్వాత మ‌త‌ఘ‌ర్ష‌ణ‌లు చోటు చేసుకోవడం, ఈ ఘ‌ర్ష‌ణ‌ల్లో దాదాపు 2000 మంది కి పైగా ప్రాణాలు కోల్పోవ‌డం తెలిసిందే.

ఈ ఘ‌ర్ష‌ణ‌లు దేశంలోని అనేక ప్రాంతాల‌కు కూడా విస్త‌రించాయి. ఈ క్ర‌మంలోనే అల‌హాబాద్ హైకోర్టులో దీనిపై పిటిష‌న్ దాఖ‌లైంది. ఈ ప్రాంతాన్ని మూడు భాగాలుగా విభ‌జించిన కోర్టు.. రెండు భాగాల‌ను హిందూ ముస్లింల‌కు పంచిపెట్ట‌గా.. మూడో భాగం అత్యంత కీల‌క‌మైన భాగాన్ని త‌ట‌స్థంగా ఉంచింది. దీంతో ఈ కేసును సుప్రీం కోర్టులో స‌వాలు చేశారు. దీంతో గ‌త ఏడాది సుదీర్ఘ విచార‌ణల అనంత‌రం సుప్రీం కోర్టుత్రిస‌భ్య క‌మిటీని ఏర్పాటు చేసింది. దీనిలో శ్రీశ్రీరవిశంక‌ర్ స‌హా ముస్లింల నుంచి ఒక ప్ర‌తినిధిని, న్యాయ నిపుణుడిని నియ‌మించి ప‌రిష్కారం చూపించాల‌ని కోరింది.

అయితే, ఈ క‌మిటీ త‌మ‌వ‌ల్ల కాదంటూ.. చేతులు ఎత్తేసింది. దీంతో సుప్రీం కోర్టు 40 రోజుల కింద‌ట త‌నే స్వ‌యంగా ఈ కేసును విచారించేందుకుస‌న్న‌ద్ధం చేసుకుంది. ఈ విచార‌ణ‌లో అటు హిందువులు, ఇటు ముస్లింలు కూడా ధాటిగానే వాద‌న‌లు వినిపించారు. రాముడు ఇక్క‌డే జ‌న్మించాడ‌నేందుకు సంబంధించి న ఆధారాల‌ను హిందువు న్యాయ‌వాదులు కోర్టుకు చూపించారు. ఈ క్ర‌మంలోనే ముస్లింల త‌ర‌ఫు న్యాయ‌వాది స‌ద‌రు పుస్త‌కాన్ని కోర్టు హాల్లో ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ముందే చింపేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. దీంతో ఈ విష‌యం.. మ‌ళ్లీ మొద‌టికి వ‌స్తుందా? లేక‌.. తుది తీర్పు వెలువ‌డుతుందా? అనేది వేచి చూడాలి.

అయోధ్య వివాదంలో కీల‌క మ‌లుపు…పుస్త‌కాన్ని చించేసిన ముస్లింల త‌ర‌ఫు లాయ‌ర్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts