గంద‌ర‌గోళంలో బాల‌య్య‌..!

October 15, 2019 at 3:55 pm

నంద‌మూరి బాల‌కృష్ణ ఇప్పుడు గంద‌ర‌గోళం ప‌డ్డాడ‌ట‌. ఒక‌టి అనుకుంటే ఒక‌టి అవుతుంది.. చివ‌రికి ఏమి అవుతుందో అనే ఆందోళ‌న‌లో బాల‌కృష్ణ ఉన్నాడ‌ట‌. ఓసారి ఒక‌టి అనుకుంటున్నాడ‌ట‌.. మ‌రోమారు మ‌రోకటి.. ఇంకోసారి ఇంకోటి అనుకుంటున్నాడ‌ట‌.. ముచ్చ‌ట‌గా మూడు అనుకుంటున్న‌ప్ప‌ట‌కి చివ‌రికి ఏది ఖాయ‌మ‌వుతుందో ఫ‌లితం ఎలా ఉంటుందో అనే డైలామాలో బాల‌య్య ఉన్నాడ‌ట‌..

ఇంత‌కు బాలయ్య ఎందుకు డైలామాలో ఉన్నాడు. అంత అవ‌స‌రం ఏమోచ్చింది అనుకుంటున్నారా.. అవును మ‌రి బాల‌య్య తాను నటిస్తున్న సినిమాకు ఏ పేరు పెట్టాలో తెలియ‌క త‌లగోక్కుంటున్నాడ‌ట‌. బాల‌య్య 105వ చిత్రంలో కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నాడు. హ్య‌పీ మూవీస్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ నిర్మాత సి. క‌ళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏ టైటిల్ ఖ‌రారు చేయాలో పాలు పోవ‌డం లేద‌ట‌.

బాల‌య్య ఈ సినిమాకు ఇప్ప‌టికే రూల‌ర్ అని అనుకున్నాడ‌ట‌. కానీ ఎందుకో ఈ టైటిల్ బాగా లేద‌ని బాల‌య్య మ‌రోపేరు కోసం ప్ర‌య‌త్నిస్తుండ‌గా, సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ డిజాస్ట‌ర్ సినిమా టైటిల్ డిపార్ట్‌మెంట్ పేరు పెడితే బాగుంటుంద‌ని అనుకున్నార‌ట‌.. అయితే మ‌రో ఆలోచ‌న ప్ర‌కారం సినిమాకు జడ్జిమెంట్ అని పేరు పెడితే ఎలా ఉంటుందుని అనుకుంటున్నార‌ట‌. అంటే ముచ్చ‌ట‌గా మూడో పేరును ప‌రిశీలిస్తున్నార‌న్న మాట‌.. ఈ మూడు టైటిల్స్‌లో ఏ టైటిల్ పెట్టాలో తెలియ‌క బాల‌య్య గంద‌రోళంలో ఉన్నాడ‌ట‌.

గంద‌ర‌గోళంలో బాల‌య్య‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts