ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియ‌కు షాక్‌..

October 3, 2019 at 11:58 am

ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు షాక్ తగిలింది. ఆమె భర్త భార్గవ్ రామ్ పై కేసు నమోదయింది. తాజా ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత అఖిల‌తో పాటు ఆమె భ‌ర్త భార్గ‌వ్‌పై అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు అఖిల భ‌ర్తపై ఓ క్రషర్ ఇండస్ట్రీ ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు. అస‌లు విష‌యంలోకి వెళితే భార్గ‌వ్ త‌న క్ర‌ష‌ర్‌ను ఇచ్చేయాల‌ని ఒత్తిడి చేస్తున్న‌ట్టు ఆ క్ర‌ష‌ర్ య‌జ‌మానిపై ఒత్తిడి చేస్తున్నాడని, బెదిరిస్తున్నాడని ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు.

క్ర‌ష‌ర్ ఇండస్ట్రీ ఓనర్ శివరామిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా భూమా దంపతులు బ్రతికున్న సమయంలో శివరామిరెడ్డి, భూమా కుటుంబానికి ఇద్దరికి కలిసి క్వారీ ఉంది. అయితే భూమా దంపతులు మరణించిన అనంతరం అఖిల ప్రియను భార్గవ్ రామ్ పెళ్లి చేసుకున్న నేపథ్యంలో క్వారీ తమకే చెల్లుతుందని.. క్వారీని ఇచ్చేయాలని భార్గవ రామ్ శివరామిరెడ్డితో అన్నట్టు తెలుస్తోంది.

ఈ విష‌యంలో భార్గ‌వ్ రామ్‌కు, శివ‌రామిరెడ్డి ఇప్పటికే ప‌లుసార్లు గొడ‌వ‌లు కూడా జ‌రిగిన‌ట్టు స‌మాచారం. బుధ‌వారం భార్గ‌వ్‌కు చెందిన కొంద‌రు క్వారీలోకి ప్ర‌వేశించి క్వారీని ధ్వంసం చేసిన‌ట్టు శివరామిరెడ్డి తెలిపారు. అంతేకాదు క్వారీని తనకు ఇవ్వాలని భార్గవ రామ్ తనపై బెదిరింపులకు దిగుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు శివరామిరెడ్డి. ఈ మేరకు ఆళ్లగడ్డ పోలీసులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు.

ఏదేమైనా రాజ‌కీయంగా భ‌ర్త చ‌ర్య‌ల తీవ్రంగా ఇబ్బంది ప‌డుతోన్న మాజీ మంత్రి అఖ‌ల‌ప్రియ‌కు ఇప్పుడు అత‌డి తీరుతో మ‌రిన్ని ఇబ్బందులు త‌ప్పేలా లేవ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. భార్గ‌వ్ రామ్ దూకుడు చ‌ర్య‌ల వ‌ల్లే అఖిల ఆళ్ల‌గ‌డ్డ‌లో ఎంత సానుభూతి ఉన్నా ఓడిపోయార‌ని కూడా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియ‌కు షాక్‌..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts