ఏపీపై బీజేపీ నిజ‌స్వ‌రూపం ఇదేనా… !

October 23, 2019 at 10:51 am

రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌తో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న ఏపీని ఆదుకునే విష‌యంలో కేంద్రం వైఖ‌రిని ఏ ఒక్క‌రూ జీర్ణించుకోలేక పోతున్నారు. ప్ర‌త్యేక హోదా విష‌యం ద‌గ్గ‌ర నుంచి పోల‌వ‌రం ప్రాజెక్టు నిధుల వ‌ర కు, రాజ‌ధాని నిధుల నుంచి ఇతర మౌలిక స‌దుపాయాల వ‌ర‌కు కూడా ఏపీకి చేయాల్సిన సాయంపై కేం ద్రం దోబూచులాడుతూనే ఉంది. గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వంతో చెలిమి చేసిన‌ప్పుడు.. ఆ త‌ర్వాత బా బుతో విభేదాలు పెట్టుకున్న‌ప్పుడు కూడా కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల వైఖ‌రిలో పెద్ద‌గా మార్పు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

హోదా ఇచ్చేది లేద‌ని క‌రాఖండీగా చెప్పిన కేంద్రం.. ఏపీ ప‌రిస్తితుల‌ను ప‌ట్టించుకునే ప్ర‌య‌త్నం కూడా చేయ‌డం లేదు. మ‌రోప‌క్క‌, ఏపీకి ఇవ్వాల్సిన నిధుల విష‌యంలోనూ, కేటాయింపుల్లో కూడా అన్యాయం గానే వ్య‌వ‌హ‌రిస్తోంది. గ‌త చంద్ర‌బాబు ప్ర‌బుత్వంతో ఉన్న విబేదాల కార‌ణంగా ఏపీకి అన్యాయం జ‌రిగింద‌నే భావ‌న ప్ర‌జ‌ల్లో ఉంది. బీజేపీతో అంట‌కాగి.. విజ‌యం సాధించిన చంద్ర‌బాబు త‌ర్వాత ఆ పార్టీని ప‌క్క‌న పెట్టినందునే లేక‌.. కేంద్రం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను ఏపీలో అమ‌లు చేస్తూ.. కూడా వాటిని త‌న‌పేరు పెట్టుకుంటున్నందునే కేంద్రంలోని బీజేపీ తీవ్రంగా స్పందించి, ఏపీకి స‌హాయం చేయ‌డంలో వెనుక‌డుగు వేసింద‌ని భావించారు.

కానీ, ఇప్పుడు ఏపీలో ప్ర‌జ‌లు ఎవ‌రి ప‌క్షాన‌నిలిచారో స్ప‌ష్ట‌మైంది. ఏయే కార‌ణాల వ‌ల్ల బీజేపీకి క‌నీసం డి పాజిట్లు కూడా ద‌క్క‌లేదో ఇప్ప‌టికే అర్ధ‌మై ఉండాలి. అయినా కూడా ప్ర‌జ‌లు ఎన్నుకొన్న ప్ర‌భుత్వాన్ని, భా రీ మెజారిటీ సాధించి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న జ‌గ‌న్‌ను క‌నీస మాత్రంగానైనా బీజేపీ పెద్ద‌లు గౌ రవించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఏపీ స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోక పోగా.. ఏపీకి ఇవ్వాల్సిన నిధుల విష‌యంలో నూ కేంద్రం త‌న వైఖ‌రిని ఏ మాత్ర‌మూ మార్చుకోలేదు. దీంతో రాష్ట్రంలో అభివృద్ది కుంటు ప‌డింది. పైగా అవినీతిని వెలికి తీస్తాన‌న్న

జ‌గ‌న్ ప్ర‌బుత్వానికి కూడా స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం మ‌రింత దారుణంగా ఉంద‌ని బీజేపీలోని ఓ వ‌ర్గం చేస్తున్న వ్యాఖ్యానాలు. మొత్తంగా చూసుకుంటే.. బీజేపీ త‌ను అధికారంలో లేని రాష్ట్రంలో ఇంత క‌ర్కశంగా వ్య‌వ‌హ‌రిస్తుందా? అనే ప్ర‌శ్న ఉద‌యించ‌డం గ‌మ‌నార్హం. తాజాగా జ‌గ‌న్‌కు కూడా అప్పాయింట్ మెంట్ ఇవ్వ‌కుండా అవ‌మానించ‌డం దేనికి సంకేత‌మో బీజేపీ పెద్ద‌లు గ‌మ‌నించాలి. పైగా ఇలా చేయ‌డం ద్వారానే ఏపీలో తాము ఎదుగుతామ‌ని భావిస్తే.. అంత‌క‌న్నా మూర్ఖ‌త్వం మ‌రొక‌టి ఉండ‌ద‌నే విష‌యాన్ని గుర్తించాలి.

ఏపీపై బీజేపీ నిజ‌స్వ‌రూపం ఇదేనా… !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts