చింత‌మ‌నేని త‌ర్వాత నెక్ట్స్ టార్గెట్ ఆ మాజీ ఎమ్మెల్యేనే!

October 10, 2019 at 11:33 am

ఐదేళ్ల టిడిపి ప్రభుత్వ పాలనలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కొందరు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. కొందరు ప్రభుత్వ సంప‌ద‌ను, మ‌రికొంద‌రు స‌హ‌జ వ‌న‌రుల‌ను ఇష్టం వచ్చినట్టు దోచుకుంటే… మరికొందరు వరుస వివాదాలతో లెక్కకు మిక్కిలిగా కేసుల్లో చిక్కుకున్నారు. అప్పట్లో కేసు పెట్టేందుకు కూడా ఎవరు సాహసించని పరిస్థితి. టిడిపి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారం నుంచి దిగి పోయిందో అప్పటి నుంచి చి అక్రమాలకు పాల్పడిన నాయకులే టార్గెట్ గా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే కోడెల శివప్రసాద్ కుటుంబం… మాజీ విప్‌లు కూన రవి కుమార్, చింత‌మ‌నేని ప్రభాకర్ లాంటి నేతలపై కేసులు నమోదయ్యాయి.

తాను స్పీక‌ర్‌గా ఉన్నప్పుడు తన వారసులు చేసిన అక్రమాలను చూసి చూడనట్లు వదిలేసిన స్పీకర్ కోడెల ఇటీవల వరుస కేసుల నేపథ్యంలో ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. మ‌రో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరాచకాలకు అంతే లేదు ఆయన ఇప్పటికే 60కి పైగా కేసులు ఉన్నట్టు సమాచారం. ప్ర‌స్తుతం ఆయన రిమాండ్లో ఉన్నారు. ఇక కూన‌ రవి కుమార్ కూడా అరెస్టు నుంచి తప్పించుకోవటానికి అష్టకష్టాలు పడి చివరకు బెయిల్‌ తెచ్చుకున్నారు. ఇలా పలువురు టిడిపి నేతలను వ‌రుస‌గా కేసులు వెంటాడుతున్నాయి.

ఎన్నిక‌ల‌కు ముందు నుంచి వైసీపీ అధినేత జ‌గ‌న్‌తో పాటు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సైతం చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌ను టార్గెట్గా చేసుకుని విమ‌ర్శ‌లు చేశారు. చింత‌మ‌నేని అయితే త‌న‌పై జ‌గ‌న్‌, ప‌వ‌న్ ఇద్ద‌రు వ‌చ్చి పోటీ చేసినా తానే గెలుస్తాన‌ని బీరాలు పోయి మ‌రీ ఓడిపోయారు. ఇక ఇప్పుడు చింత‌మ‌నేనిపై వ‌రుస‌గా కేసులు పెట్టి జైల్లోనే ఉంచుతున్నారు. ఆపరేషన్ చింతమనేని పూర్తయితే ఆపరేషన్ యరపతినేని ప్రారంభించడానికి వైసీపీ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు గుర‌జాల మాజీ ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తుంది. తాను అమాయ‌కుడినంటూ య‌ర‌ప‌తినేని చెబుతున్నా.. సీబీఐ ద‌ర్యాప్తులో దొరికేస్తారని టీడీపీ కూడా భయపడుతోందట. ఆయ‌న ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు ప‌ల్నాడు ప్రాంతంలో అక్ర‌మ మైనింగ్‌తో కోట్లాది రూపాయ‌లు వెన‌కేసుకున్నార‌న్న ఆరోప‌ణ‌లు తీవ్రంగా ఉన్నాయి. జ‌గ‌న్‌, విజ‌య‌సాయిరెడ్డితో పాటు ప‌ల్నాడుకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు ఆయ‌న్ను గ‌ట్టిగా టార్గెట్‌గా చేసుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఏం జ‌రుగుతుందో ? చూడాలి.

చింత‌మ‌నేని త‌ర్వాత నెక్ట్స్ టార్గెట్ ఆ మాజీ ఎమ్మెల్యేనే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts