మెగాస్టార్ 152 క‌థ లీకైందోచ్‌…!

October 15, 2019 at 4:28 pm

మెగాస్టార్ చిరంజీవి న‌టించ‌బోయే 152వ చిత్రంలోని క‌థ లీకైంద‌నే ప్ర‌చారం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్ ఛ‌ల్ చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో 152వ చిత్రంకు ఇప్ప‌టికే కొబ్బ‌రి కాయ కొట్టారు. ఈ సినిమా త్వ‌రలో సెట్స్ మీద‌కు రాబోతుంది. అయితే ఈసినిమా క‌థ ఇదేనంటూ ఇప్పుడు అనేక ర‌కాల ఊహ‌గానాలు వినిపిస్తున్నాయి.

కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం అంటే ఆ సినిమా త‌ప్ప‌కుండా సందేశాత్మ‌క చిత్రం అయి ఉంటుంది. ఎందుకంటే కొర‌టాల ఎక్కువ‌గా తాను తీసే సినిమాల్లో సోష‌ల్ మెసేస్ ఉండే ఆంశాల‌ను ఎన్నుకుంటారు. ప్ర‌తి ఒక్క‌రికి ఒక సందేశం అందించాల‌నే ఆలోచ‌న‌తో క‌మ‌ర్షియ‌ల్‌గా ఆలోచిస్తూనే సందేశం ఉండే క‌థ‌ను త‌యారు చేసుకుంటారు. అందుకే ఇప్పుడు మెగాస్టార్‌తో చేసే సినిమా కూడా ఓ సోష‌ల్ మెసెజ్ అందించే సినిమాగా రూపొందిస్తున్నార‌ట‌..

మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్రంతో ఓ వీరుడి క‌థ‌ను తీసుకున్నారు. ఓ భార‌త యోధుడు త‌న పుట్టిన భూమి బానిస‌ల క‌బ్జాలో చిక్కిపోతుంటే దాన్ని కాపాడుకునేందుకు చేసిన పోరాటంను నేప‌థ్యంగా తీసుకుని సైరా లో న‌టించాడు. ఇప్పుడు మ‌రో మెసేజ్ ఇచ్చే సినిమాతో రాబోతున్నాడ‌ట‌. అది ఓ దేవాద‌య శాఖ ఉద్యోగిగా దేవాల‌యాల్లో జ‌రిగే అక్ర‌మాల‌ను ఎలా బ‌య‌ట‌పెట్టాడు..వాటిని ఎలా కాపాడాడు అనే క‌థ‌తో సినిమాలో న‌టిస్తున్నాడట‌..

మెగాస్టార్ 152 క‌థ లీకైందోచ్‌…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts