ముగ్గురు మెగా హీరోల‌కు పెద్ద ఎదురు దెబ్బ‌…

October 15, 2019 at 12:54 pm

టాలీవుడ్ హీరోలు కొన్నేళ్లుగా త‌మ సినిమాల మార్కెట్‌ను రెండు తెలుగు రాష్ట్రాల‌ను దాటించాల‌ని ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. వీళ్ల‌లో ఒక‌రో ఇద్ద‌రో మాత్ర‌మే స‌క్సెస్ అవ్వ‌గా… మిగిలిన వాళ్లంద‌రు ప్లాప్ అవుతున్నారు. బాహుబ‌లి సీరిస్‌తో వ‌చ్చిన క్రేజ్‌తో సాహోతో ప్ర‌భాస్ నార్త్‌లో బాగా పాపుల‌ర్ అయ్యాడు. సాహో సౌత్‌లో ప్లాప్ అయినా నార్త్‌లో హిట్ అయ్యింది. ఇక మెగా కాంపౌండ్ హీరో అల్లు అర్జున్‌కు అనుకోకుండా కేర‌ళ‌లో ఫాలోయింగ్ వ‌చ్చింది.

ఇక మెగా హీరోలు త‌మ మార్కెట్ ఇత‌ర భాష‌ల్లో విస్త‌రించేందుకు చిరు, ప‌వ‌న్‌, చెర్రీ ఇలా చాలా ప్ర‌య‌త్నాలే జ‌రిగాయి. ఒక‌ప్పుడు ఆజ్‌కా గూండారాజ్, ప్ర‌తిబంద్ లాంటి సినిమాల‌తో ఓ మోస్త‌రుగా గుర్తింపు సంపాదించిన చిరు.. ఆ త‌ర్వాత మ‌ళ్లీ అటు వైపు చూడ‌లేదు. మ‌ళ్లీ చాలా సంవ‌త్స‌రాలకు 2013లో జంజీర్ లాంటి క్లాసిక్ మూవీ రీమేక్‌తో రామ్‌చ‌ర‌ణ్ బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ప్లాప్ అయ్యింది.

జంజీర్ తెలుగులో తుఫాన్‌గా వ‌చ్చింది. ఆ సినిమా దెబ్బ‌తో అస‌లు బాలీవుడ్ వైపు చూసే సాహ‌సం కూడా చ‌ర‌ణ్ చేయ‌లేదు. కొన్నేళ్ల విరామం త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాను హిందీలో కూడా తీశాడు. తెలుగుతో పాటు ఒకేసారి రిలీజ్ కూడా చేశాడు. ఆ సినిమా తెలుగు, త‌మిళ్‌లో ఘోరంగా ప్లాప్ అయ్యింది. ఇక ఇప్పుడు చిరు ఏకంగా సైరాతో ఐదు భాష‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు.

సైరా తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ళ‌యాళం, హిందీ భాష‌ల్లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. ఒక తెలుగు త‌ప్ప అన్ని చోట్ల ప్లాప్ అయ్యింది. హిందీలో ఈ సినిమా రైట్స్‌ రూ.25 కోట్ల‌కు అమ్మితే 12 కోట్ల గ్రాస్, ఐదున్న‌ర కోట్ల దాకా షేర్ వ‌చ్చిందంతే. దీనిని బ‌ట్టి సైరా కూడా అక్క‌డ డిజాస్ట‌ర్ అయ్యింది. మొత్తానికి మెగా హీరోలకు బాలీవుడ్ ప్ర‌య‌త్నం ఎప్పుడు క‌లిసి రాలేదు.

ముగ్గురు మెగా హీరోల‌కు పెద్ద ఎదురు దెబ్బ‌…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts