బ్రేకింగ్‌: చిరంజీవికి జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ ఖ‌రారు

October 10, 2019 at 2:20 pm

కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అపాయింట్‌మెంట్ కోరారు. ఈ మేరకు ఏపీ సీఎంవో కార్యాలయం అపాయింట్‌మెంట్ ఖరారు చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం జగన్‌తో చిరంజీవి, రామ్ చరణ్ భేటీ అవుతారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్ర‌ముఖ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా సైరా న‌ర‌సింహారెడ్డి సినిమా తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాకు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే సినిమాను మ‌రింత‌గా ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లేందుకు చిరంజీవి ప‌లువురు ప్ర‌ముఖుల‌ను క‌లుస్తూ సినిమా చూడాల‌ని ఆహ్వానిస్తున్నారు. ఇప్ప‌టికే తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌తో పాటు ప‌లువురిని క‌లిసి సినిమా చూడాల‌ని కోరారు. ఈ నేప‌థ్యంలోనే
సైరా నరసింహారెడ్డిని వీక్షించడానికి రావాల్సిందిగా సీఎం జగన్‌ను చిరంజీవి కోరనున్నారు.

జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చిరంజీవి తొలిసారి ఆయనతో భేటీ కాబోతున్నారు. ఇక చిరు కోరిక మేర‌కు తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ కుటుంబంతో కలిసి సినిమా చూసి అద్భుతంగా ఉందంటూ ప్రశంచిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిని సైతం చిరు క‌ల‌వ‌డంతో అటు సినిమా ప‌రంగానే కాకుండా… ఇటు రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ ఈ భేటీకి ప్రాధాన్య‌త ఏర్ప‌డింది.

ఈ ఎన్నిక‌ల్లో మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అంతా జ‌గ‌న్‌కు యాంటీగా జ‌న‌సేన‌కు స‌పోర్ట్ చేశారు. ప‌వ‌న్ సైతం జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

బ్రేకింగ్‌: చిరంజీవికి జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ ఖ‌రారు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts