జ‌గ‌న్‌తో చిరు భేటీ వెనుక కిటుకు ఇదేనా …?

October 14, 2019 at 4:06 pm

మెగాస్టార్ అభిమానులు సైతం ఊహించ‌ని ప‌రిణామం నేడు అమ‌రావ‌తిలో చోటు చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి స‌తీ స‌మేతంగా సోమ‌వారం ఏపీ సీఎం జ‌గ‌న్‌తో భేటీ అయ్యారు. ఆయ‌న‌ను శాలువా క‌ప్పి మ‌రీ చిరు ఘ‌నంగా స‌త్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో సీఎం జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తి కూడా పాల్గొన‌డం గ‌మ‌నార్హం. అయితే, ఈ భేటీకి చాలా ప్రాధాన్యం సంత‌రించుకుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏపీ సీఎంగా జ‌గ‌న్ ప్ర‌మాణం చేసిన త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు టాలీవుడ్ నుంచి ఏ ఒక్క హీరో కూడా వ‌చ్చి ఆయ‌న‌ను విష్ చేయ‌లేదు. ఎవ‌రూ కూడా అనుకూలంగా మాట్లాడింది కూడా లేదు.

దీంతో టాలీవుడ్‌కి జ‌గ‌న్ అంటే ప‌డ‌ద‌నే అభిప్రాయం ఓ వ‌ర్గంలో ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో ఉన్న‌ట్టుండి మెగాస్టార్ చిరంజీవి స‌తీ స‌మేతంగా అమ‌రావ‌తి రావ‌డం జ‌గ‌న్‌ను క‌ల‌వ‌డం, స‌త్క‌రించ‌డం, ఆయ‌న ఇచ్చిన విందును స్వీక‌రించ‌డం వంటివి చాలా వ‌ర‌కు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. అయితే, పైకి చెబుతున్న విష‌యం ప్ర‌కారం ఇటీవ‌ల మెగాస్టార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసిన‌ ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చ‌రిత్రతో కూడిన మూవీ సైరా న‌ర‌సింహారెడ్డిని ప్ర‌త్యేకంగా వీక్షించేందుకు జ‌గ‌న్‌ను ఆహ్వానించ‌డానికే చిరు వ‌చ్చార‌ని అంటున్నారు.

నిజానికి గ‌తంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసిన 150 చిత్రం ఖైదీ నెంబ‌ర్ 150 స‌మ‌యంలో చిరంజీవి ఎవ‌రినీ ఆహ్వానించ‌లేదు. అప్ప‌టి సీఎం చంద్ర‌బాబును క‌లిసి ఆయ‌న‌ను సినిమా చూడాల‌ని ఎక్క‌డా పిల‌వ‌లే దు. పైగా ఆయ‌న ఎప్పుడు గ‌డిచిన ఐదేళ్ల కాలంలో చంద్రబాబును కూడా క‌లిసింది లేదు. కానీ, అనూ హ్యంగా ఇప్పుడు జ‌గ‌న్‌తో భేటీ కావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

రాయ‌ల‌సీమ ప్రాంతానికి చెందిన స్టోరీ కాబ‌ట్టి, సీఎం జ‌గ‌న్ కూడా సీమ ప్రాంతానికి చెందిన వ్య‌క్తే కాబ‌ట్టి ఆయ‌న‌ను ఆహ్వానించేందుకు చిరు వ‌చ్చాడ‌ని అనుకోవాలా? లేక సైరాకు వినోద‌పు ప‌న్నును మిన‌హాయించుకునేలా ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు చేసేందుకు వ‌చ్చాడా? అనే చ‌ర్చ సాగుతోంది.ఈ క్ర‌మంలోనే రాజ‌కీయంగా కూడా కొన్ని విష‌యాల‌పై చ‌ర్చలు జ‌రిపిన‌ట్టు తెలుస్తోంది. అయితే, ఏం జ‌రిగిందనే విష‌యం ఇప్ప‌టి వ‌ర‌కు గోప్యంగానే ఉంచారు.

జ‌గ‌న్‌తో చిరు భేటీ వెనుక కిటుకు ఇదేనా …?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts