‘చాణక్య’ రివ్యూ & రేటింగ్…హిట్టా… ఫ‌ట్టా..!

October 5, 2019 at 10:50 am

బ్యాన‌ర్‌: ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
న‌టీన‌టులు: గోపీచంద్‌, మెహ్రీన్ ఫిర్జాదా,
సినిమాటోగ్ర‌ఫీ: వెట్రీ
మ్యూజిక్‌: విశాల్ చంద్ర‌శేఖ‌ర్‌
నిర్మాత‌: రామ బ్ర‌హ్మం సుంక‌ర‌
ద‌ర్శ‌క‌త్వం: తిరు
ర‌న్ టైం: 147 నిమిషాలు
సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ
రిలీజ్ డేట్‌: 05 అక్టోబ‌ర్‌, 2019

టాలీవుడ్ హీరో గోపిచంద్ మ‌రో కొత్త క‌థాంశంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. త‌మిళంలో మంచి గుర్తింపు పొందిన ద‌ర్శ‌కుడు తిరు తెర‌కెక్కించిన తొలి తెలుగు చిత్రం చాణ‌క్య‌లో హీరోహీరోయిన్లుగా గోపిచంద్‌, మెహ్రీన్ న‌టించారు. త‌మిళంలో ఎన్నో మంచి సినిమాలు తీసిన తిరు, టాలీవుడ్ ఇంట్రెస్టింగ్ యాక్ష‌న్ హీరో గోపిచంద్ కాంబోలో వ‌స్తున్న సినిమా కావ‌డంతో ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి నెల‌కొంది. అందుకు త‌గ్గ‌ట్టుగా ఈ సినిమా టీజ‌ర్ ఉండ‌డంతో అంచ‌నాలు పెరిగాయి. ఇలా అంద‌రూ ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్న చాణ‌క్య సినిమా శుక్ర‌వారం విడుద‌ల అయింది. అంతేగాకుండా.. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జ‌రీన్ ప్ర‌త్యేక గీతంలో న‌టించడంతో మ‌రింత ఆస‌క్తి నెల‌కొంది. నేప‌థ్యంలో చాణ‌క్య సినిమా ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను ఏ మేర‌కు అందుకుందో తెలుసుకుందాం.

క‌థ‌లోకి వెళ్దాం..
ఇక చాణ‌క్య కథలోకి వెళ్దాం.. ఈ సినిమాలో అర్జున్(గోపిచంద్) ఓ అండ‌ర్ క‌వ‌ర్ ఏజెంట్‌గా క‌నిపిస్తాడు. భారతదేశానికి చెందిన రీసెర్చ్ అండ్ వింగ్ ఉడెర్ కవర్ ఏజెంట్‌గా ప‌నిచేస్తాడు. ఈ క్ర‌మంలో చేప‌ట్టిన ఒక మిషన్ నిమిత్తం అర్జున్‌ బ్యాంకు ఉద్యోగిగా మారుతాడు. ఈ క్ర‌మంలో పాకిస్తాన్‌కు చెందిన పెద్ద‌ టెర్రరిస్ట్ ఖురేషిని టార్గెట్ చేసి, ఆయ‌న‌కు సంబంధించిన కొంతమంది స్లీపర్ సెల్స్ ను చంపేస్తాడు. ఇలా ఖురేషీని అర్జున్ ఎదుర్కొనేక్ర‌మంలో ఎలాంటి మ‌లుపులు వ‌చ్చాయి..? అస‌లు ఆయ‌న‌ చేపట్టిన మిషన్ ఏమిటి? ఎందుకు చేప‌ట్టాల్సి వ‌చ్చింది..? ఇదంతా ఎలా కొనసాగింది. ఇక హీరోయిన్ మెహ్రీన్‌, గోపిచంద్ మ‌ధ్య కెమెస్ట్రీ ఎలా ఉంది..? త‌దిత‌ర అంశాల‌ను తెలుసుకోవాలంటే తెర‌పై చూడాల్సిందే మ‌రి.

కథా విశ్లేష‌ణ
ఇక క‌థా గ‌మ‌నం ఎలా ఉందో చూద్దాం.. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా.. ఇంట్రెస్టింగ్ యాక్ష‌న్‌ క‌థాంశాల‌తో ముందుకు వ‌చ్చే హీరో గోపిచంద్‌. తిరు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన సినిమా చాణ‌క్య కూడా అలాంటిదే. అయితే.. ఫ‌స్టాఫ్‌ కాస్త నెమ్మ‌దిగా సాగినా.. సెకండాఫ్‌ మాత్రం బాగా న‌డిచింది. భార‌త‌దేశ ప‌రిశోధ‌న శాఖ వింగ్ హెడ్‌గా నాజ‌ర్ ప‌ని చేస్తుంటాడు. గోపీచంద్ సిరియాలో ఓ అండ‌ర్ క‌వ‌ర్ ఆప‌రేష‌న్ మీద ప‌ని చేస్తుంటాడు. ఫ‌స్టాఫ్‌లో ద‌ర్శ‌కుడు తిరు చాలా సీన్ల‌ను బోరింగ్‌గా తీసేశాడు. ప్ర‌ధానంగా సెకండాఫ్‌లో వ‌చ్చే ప‌లు యాక్ష‌న్ స‌న్నివేశాలు మాత్రం ప్రేక్ష‌కులను క‌ట్టిప‌డేస్తాయి. ఇక‌ క‌థానుసారంగా వ‌చ్చే ట్విస్ట్‌లు ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంటాయి. అలాగే.. గోపిచంద్‌, మెహ్రీన్‌ మ‌ధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇక బాలీవుడ్ బ్యూటీ జ‌రీన్ చేసిన ప్ర‌త్యేక గీతం కూడా సినిమాకు అద‌న‌పు బ‌లమ‌నే చెప్పొచ్చు. అయితే.. ద‌ర్శ‌కుడు తిరు మొద‌టి భాగంలో కూడా మ‌రికొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటే సినిమా మ‌రింత ఇంట్రెస్టింగ్ ఉండేది. థ్రిల్లింగ్ కోవ‌ర్ట్ ఆప‌రేష‌న్ నేప‌థ్యంలో టైటిల్స్ వేయ‌డం బాగుంది.

ఎవ‌రెలా చేశారో చూద్దాం..
హీరో గోపిచంద్ మ‌రోసారి త‌నదైన న‌టన‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాడు. ఆయ‌న న‌ట‌న హైలెట్‌గా నిలుస్తుంది. ప్ర‌ధానంగా యాక్ష‌న్ స‌న్నివేశాల్లో ఆయ‌న క‌నిపించిన తీరు సూప‌ర్బ్‌. హీరోయిన్ మెహ్రీన్ కూడా త‌న పాత్ర‌కు పూర్తి న్యాయం చేసింది. అయితే.. తమిళంలో మంచి గుర్తింపు పొందిన ద‌ర్శ‌కుడు తిరు టాలీవుడ్‌లో మాత్రం మొద‌టి సినిమాతోనే కొంత త‌డ‌బ‌డిన‌ట్టు అనిపిస్తుంది. ఇక‌ వెట్రి పళనిస్వామి అందించిన సినిమాటోగ్రఫీ చాలాచాలా బాగుంది. ఇక‌ విశాల్ అందించిన పాట‌లు ఆక‌ట్టుకుంటాయి. అలాగే శ్రీచరణ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ క‌థాగ‌మ‌నానికి త‌గ్గ‌ట్టుగా ఉంది. ఏదిఏమైనా.. హీరో గోపిచంద్ మ‌రో విభిన్న క‌థాంశంతో ప్రేక్ష‌కుల‌ను మ‌రోసారి ఆక‌ట్టుకున్నార‌ని చెప్పొచ్చు.

ప్ల‌స్ పాయింట్స్ (+) :
– గోపీచంద్ పెర్పామెన్స్‌
– నిర్మాణ విలువ‌లు
– వెట్రీ సినిమాటోగ్ర‌ఫీ

మైన‌స్ పాయింట్స్ (-) :
– ఫ‌స్టాఫ్‌
– రొటీన్ క‌థ‌
– బోరింగ్ సీన్లు
– క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ మిస్‌
– మ్యాజిక్ లేని స్క్రీన్ ప్లే
– గోపీచంద్ – మెహ్రీన్ ల‌వ్ సీన్లు

ఫైన‌ల్‌గా…
గోపీచంద్ ఇటీవ‌ల వైవిధ్య‌మైన క‌థ‌లు ఎంచుకుంటున్నాడు. అత‌డి కెరీర్‌లో స్పై థ్రిల్లర్ గా వచ్చిన చాణ‌క్య‌ సినిమా దర్శకుడు తెరకెక్కించిన తీరు సరిగా లేకపోవడంతో మ‌రీ అంత ఎట్రాక్టివ్‌గా లేదు. ఆసక్తికరంగా సాగని ఫస్ట్ హాఫ్ బోరింగ్ స్క్రీన్ ప్లే మరియు రొటీన్ కథ వంటివి దెబ్బ తీశాయి. ఓవరాల్ గా ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బిలో యావరేజ్‌గా నిలిచే ఛాన్స్ ఉంది.

చాణ‌క్య TJ రేటింగ్ : 2.5 / 5

‘చాణక్య’ రివ్యూ & రేటింగ్…హిట్టా… ఫ‌ట్టా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts