హ‌రీశ్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందా..!

October 19, 2019 at 10:58 am

టీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌, రాష్ట్ర మంత్రి హ‌రీశ్‌రావుకు క‌ష్టాలు వ‌చ్చిప‌డ్డాయి. కేసీఆర్ త‌ర్వాత టీఆర్ఎస్ లో అంత‌టి ఛ‌రిష్మా గ‌ల నేత‌గా అటు పార్టీలో, ఇటు ప్ర‌జ‌ల్లో హ‌రీశ్ కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. ఎలాంటి ప్ర‌తి కూల ప‌రిస్థితులైనా, క్లిష్ట స‌మ‌స్యనైనా స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోవ‌డంలో ఆయ‌న‌కు మ‌రెవ‌రూ సాటిలేర‌ని కూడా ఆపార్టీ నేత‌లు చెబుతుంటారు. అయితే ఇటీవ‌ల చోటుచేసుకుంటున్న ప‌రిణామాలు హ‌రీశ్‌రావుకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఆయ‌న ప్ర‌తిష్ట‌ను బ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నాయి.

స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల చేప‌ట్టిన స‌మ్మె ఉధృత రూపం దాల్చింది. ఈ స‌మ్మెకు అన్ని ప్ర‌తిప‌క్ష పార్టీల‌తో పాటు ప్ర‌జా సంఘాలు కూడా మ‌ద్ద‌తు ప‌లుకుతున్నాయి. అయితే గ‌తం లో ఆర్టీసీ గుర్తింపు సంఘం టీఎంయూకు గౌర‌వ అధ్య‌క్షుడిగా ఉన్న హ‌రీశ్‌రావు ప్ర‌స్తుతం కార్మికుల స‌మ్మెపై మౌనం దాల్చ‌డంపై యూనియ‌న్ నేత‌లు, కార్మికుల నుంచి ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం అవ‌తున్నాయి.

రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో అప్ప‌టి ఏపీఎస్ఆర్టీసీ రెండుగా చీలింది. అప్పుడు హ‌రీశ్‌ను టీఎంయూకు గౌర‌వ అద్య‌క్షుడిగా ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఎన్నుకున్నారు. అలాంటి హ‌రీశ్ నేడు అదే కార్మికులు ఇబ్బందుల్లో ఉంటే ఏం ప‌ట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుండ‌డంతో వాళ్లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఇప్ప‌టికైనా హ‌రీశ్‌రావు మౌనం వీడాల‌ని ఆర్టీసీ జేఏసీ చైర్మ‌న్ అశ్వ‌ద్థామ‌రెడ్డి కూడా విజ్ఞ‌ప్తి చేశారు. మేధావుల మౌనం ప్ర‌మాద‌క‌ర‌మ‌ని కూడా ఆయ‌న వ్యూహాత్మ‌కంగా హ‌రీశ్‌రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయిన‌ప్ప‌టికీ హ‌రీశ్ మౌనం వీడ‌లేదు.

రాష్ట్ర ఏర్పాటుకు ముందు నుంచి కూడా హ‌రీశ్ యూనియ‌న్ నేత‌ల‌తో స‌న్నిహిత సంబంధాలు కొన‌సాగించారు. అయితే ప్ర‌స్తుతం ఆర్టీసీ కార్మికులు స‌మ్మెకు దిగ‌డం, త‌మ న్యాయ‌మైన డిమాండ్లు ప‌రిష్క‌రించాల‌ని ప్ర‌భుత్వంపై ఒత్తిడి పెంచు తుండ‌టం హ‌రీశ్‌రావుకు క‌ష్టాలు తెచ్చిపెడుతోంది. ఈనేప‌థ్యంలోనే ఆయ‌న కొంత‌కాలంగా సైలెంట్ అయ్యారు. గ‌తంలో ఆర్టీసీ కార్మికుల‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన ఆయ‌న‌.. ప్ర‌స్తుత క్లిష్ట స‌మ‌యంలో మౌనందాల్చ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఇక తెలంగాణలో ఎక్క‌డ ఉప ఎన్నిక‌లు వ‌చ్చినా హ‌రీశ్ హంగామానే ఉండేది. కేసీఆర్ సైతం హ‌రీశ్‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించి అక్క‌డ పార్టీ గెలిచేలా చేసేవారు ఇప్పుడు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రుగుతున్న హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో హ‌రీశ్‌ను పూర్తిగా ప‌క్క‌న పెట్టేశారు. ఒక‌ప్ప‌టి ట్ర‌బుల్ షూట‌ర్ ఇప్పుడు డ‌మ్మీగా మారిపోయాడ‌ని యూనియ‌న్ నేత‌లు చ‌ర్చించుకోవ‌డం గ‌మ‌నార్హం.

హ‌రీశ్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts