స్టార్ హీరో వీర్యం కావాలంటోన్న మ‌హిళా క్రికెట‌ర్‌

October 7, 2019 at 11:29 am

జ‌నాల‌కు బాగా పైత్యం ముదిరి.. వేలం వెర్రిగా మారిపోతున్నారు. ఇక స్టార్ హీరోల‌ను చూసి వాళ్ల‌కు పిచ్చ అభిమానులుగా మారిపోయి ఏం చేస్తున్నారో ? ఏం మాట్లాడుతున్నారో ? అర్థం కాని ప‌రిస్థితి. సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో ఒక్క‌సారిగా హైలెట్ అవ్వాల‌ని వీళ్లు నానా ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ విష‌యంలో ఓ అమ్మాయి ఉచిత స‌ల‌హా ప‌డేసింది. తమిళనాడుకు చెందిన భావన అనే మహిళా క్రికెటర్ హృతిక్ మీద అతి ప్రేమను ఒలకపోసింది.

ఇటీవ‌లే హృతిక్ రోష‌న్, యంగ్ హీరో టైగ‌ర్ ష్రాప్ క‌లిసి న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ వార్ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మంచి వ‌సూళ్ల‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో హృతిక్ న‌ట‌న చూసిన భావ‌న మెస్మ‌రైజ్ అయ్యి ఓ ప్ర‌క‌ట‌న చేసి ప‌డేసింది. హృతిక్ వీర్యదానం చేయాలట. తన జీన్స్ అలా కొనసాగేందుకు అవకాశం ఇవ్వాలట.

భావ‌న మాట‌లు చూస్తే హృతిక్‌పై ఆమె ప్రేమ ముదిరి పిచ్చి పీక్స్‌కు చేరుకున్న‌ట్టు అనిపిస్తోంది క‌దా..! వార్ సినిమాలో తనబోటి అమ్మాయిలు హృతిక్ ను చూసి ముగ్దులయిపోయారని కూడా చెప్పుకొచ్చింది. భావ‌న ఈ మాట‌లు ఎందుకు మాట్లాడిందో కాని.. హృతిక్‌కు ఇప్ప‌టికే వార‌సులు కూడా ఉన్నారు. త‌న చిన్న‌నాటి స్నేహితురాలు సుసానేఖాన్‌ను పెళ్లాడిన హృతిక్ ఇద్ద‌రు బిడ్డ‌ల తండ్రి కూడ అయ్యాడు. ఇక ఈ జంట విడాకులు కూడా తీసుకున్నాక ఇప్పుడు హృతిక్ ఒంట‌రిగా ఉంటున్నాడు.

స్టార్ హీరో వీర్యం కావాలంటోన్న మ‌హిళా క్రికెట‌ర్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts