జేసీకి ఓ ప్ర‌శ్న: అలా అయితే మీరు కూడా జంపేనా?

October 16, 2019 at 3:11 pm

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు ఏం మాట్లాడినా చెల్లుంద‌నే అనుకుంటారు కొంద‌రు. తాము ఏం మాట్లాడినా .. ఓ వ‌ర్గం మీడియా త‌మ‌కు క‌వ‌రేజ్ ఇస్తున్నంత‌వ‌ర‌కు వారు అలా మాట్లాడుతూనే ఉంటారు. వారు మాట్లాడే మాట‌ల‌కు నిబద్ధ‌త క‌న్నా కూడా సంచ‌ల‌నాలే ఎక్కువ‌గా ఉండాల‌ని కూడా కోరుకుంటారు. అలాంటి వారిలో ఒక‌రు అనంత‌పురం మాజీ ఎంపీ, సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానం ఉన్న నాయ‌కుడు జేసీ దివాక‌ర్ రెడ్డి. రాజ‌కీయా ల్లోకి వ‌చ్చిన‌ కొన్నాళ్ల వ‌ర‌కు ఆయ‌న త‌న‌దైన పంథాలో వెళ్లారు. త‌ర్వాత దానిని మార్చుకున్నారు. త‌న పంతమే నెగ్గించుకునేందుకు, త‌న వాళ్లే ఉండేలా ఆయ‌న తాడ‌ప‌త్రి త‌దిత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో చ‌క్రం తిప్పారు.

గ‌తంలో రిజ‌ర్వ్ కాక‌ముందు శింగ‌మ‌న‌ల‌లోనూ త‌న ప్ర‌తాపం చూపించారు. అయితే, రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఆయ‌న టీడీపీలోకి చేరిపోయారు. ఇక‌, అప్ప‌టి నుంచి ఆయ‌న మీడియా వేదిక‌గా ఏదో ఒక వ్యాఖ్య చేయ‌డం, త‌న పంతం నెగ్గించుకునేందుకు బ్లాక్‌మెయిల్ రాజ‌కీయాల‌కు ఒడిగ‌ట్ట‌డం వంటివి చేస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీకి దూరంగా ఉండి..త న కుమారుడు ప‌వ‌న్‌ను రంగంలోకి దింపారు. ఆయ‌న ఓట‌మి పాల‌య్యారు. ఇక‌, అప్ప‌టి నుంచి విశ్లేష‌ణ‌లు చేస్తున్నారు. తాజాగా జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ఆయ‌న చేసిన కామెంట్లు సోష‌ల్ మీడియాలో తెగ‌వైర‌ల్ అవుతున్నాయి.

సీఎం జగన్‌కు పాలనానుభవం లేదని, పోలీసు కే సుల భయంతోనే కొందరు వైసీపీలో చేరుతున్నారని జేసీ దివాకర్‌ రెడ్డి పేర్కొన్నారు. ఒక పార్టీ నుంచి ఒక పార్టీలో జంప్ చేస్తున్న‌నేత‌ల‌పై ఆయ‌న ఇంత‌కు మించి ఏమీ మాట్లాడ‌లేదు. అయితే, దీనిపైనే సోష‌ల్ మీడియాలో కామెంట్లు అధిరిపోతున్నాయి. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీ నుంచి వెళ్లిన వారిలో కానీ, జ‌న‌సేన నుంచి వెళ్లిన వారిలో కానీ, ఒక్క తోట‌పై త‌ప్ప ఎవ‌రిపైనా కేసులు లేవు. ఆకుల స‌త్య‌నారాయ‌ణ కానీ, జూపూడి ప్ర‌బాక‌ర్ విష‌యంలో కానీ కేసులు ఎక్క‌డా లేవు. కానీ, వారు కావాల‌నుకుని వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఇక‌, జేసీ ఫార్ములా నే నిజ‌మ‌ని, కేసుల‌కు భ‌య‌ప‌డే పార్టీ మారాల‌ని అనుకున్న‌వారు ఉంటే..ఆ జాబితాలో జేసీనే ముందుంటారు. ఆయ‌న ఎంపీగా ఉన్న స‌మ‌యంలో గ‌త ఏడాది కింద‌ట పోలీసుల‌ను హిజ్రాల‌తో పోల్చారు. పోలీస్ స్టేష‌న్ల‌పై దాడి చేయించారు. ఇక‌, ఆయ‌న సోద‌రుడు తాడిప‌త్రి మాజీ ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ రెడ్డిపై కూడా అనేక కేసులు ఉన్నాయి. దౌర్జ‌న్యాలు, దందాల కేసులు లెక్కకు మిక్కిలి గానే ఉన్నాయి. ఇక‌, వీరిద్ద‌రూ ఉన్న పార్టీ అధినేత చంద్ర‌బాబుపై కూడా అనేక కేసులు పెండింగులో ఉన్నాయి.

అదేవిధంగా టీడీపీ నేత‌ల‌పైనా కేసులు ఉన్నాయి. జేసీ చెప్పిన ప్ర‌కారం చూసుకుంటే.. మ‌రి వీరంతా కూడా వైసీపీలోకి అర్జంటుగా చేరిపోవాలి క‌దా! పోనీ.. బాబు గారి సంగ‌తి ప‌క్క‌న పెట్టినా.. జేసీ ఆయ‌న బ్ర‌ద‌ర్ అయినా వైసీపీ తీర్థం పుచ్చేసుకోవాలి క‌దా! అంటున్నారు నెటిజ‌న్లు.. అంతేకాదు.. జంపింగ్ కోసం ముహూర్తం చూసుకుంటున్నారా? అంటూ.. స‌టైర్లు రువ్వుతున్నారు.

జేసీకి ఓ ప్ర‌శ్న: అలా అయితే మీరు కూడా జంపేనా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts