ఆ టాలీవుడ్ సీనియర్ హీరో ఫ్రాడ్ అంటున్న న‌టి జీవిత‌…!

October 9, 2019 at 1:04 pm

స‌హాజ న‌టి గా టాలీవుడ్‌లో పేరు సంపాదించింది న‌టి జీవిత‌. త‌లంబ్రాలు సినిమాతో హీరోయిన్‌గా తెరంగ్రేటం చేసిన జీవిత త‌రువాత కాలంలో త‌న తొలి చిత్రం హీరో డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్‌తోనే నిజ జీవితంలోనూ నెత్తిపై త‌లంబ్రాలు పోయించుకున్నారు. త‌లంబ్రాలు సినిమా నుంచి పుట్టిన ప్రేమే ఇద్ద‌రిని పెండ్లితో ఒక్క‌టి చేసింది.. ఆ ఇద్ద‌రి జంట ఎక్క‌డైనా విడ‌దీయ‌రాని జంట‌గానే ఉంటారు..

అందుకే ఈ జంట‌ను చిలుకా గోరింక‌లు అని టాలీవుడ్‌లో అంటుంటారు.. ఇక వీరు ఏ నిర్ణ‌యం తీసుకున్నా ఇద్ద‌రు అనుకోనే తీసుకుంటార‌ట‌.. అయితే రాజ‌శేఖ‌ర్ క‌న్నా జీవిత‌నే ఎక్కువ‌గా నిర్ణ‌యాలు తీసుకుంటుంద‌ట‌.. అయితే ఈ విష‌యం జీవితే స్వ‌యంగా ప్ర‌క‌టించింది.. అంతేకాదు.. రాజ‌శేఖ‌ర్‌ను జీవిత ఏమ‌ని పిలిచేదో తెలుసా.. ఏమైని అంటే.. ఫ్రాడ్ అని పిలిచేద‌ట‌.. త‌లంబ్రాలు సినిమాలో హీరోగా హీరోయిన్ జీవితను మోసం చేసిన‌ప్ప‌టి నుంచి ఫ్రాడ్ అని పిల‌వ‌డం మొద‌లెట్టింద‌ట‌…

అది కొన‌సాగింపుగా అలాగే ఇప్ప‌టికి పిలుస్తుంద‌ట జీవిత రాజ‌శేఖ‌ర్‌ను. జీవిత రాజ‌శేఖ‌ర్‌లు జీవితంలో ఒక్క‌టి కాక‌ముందు జ‌రిగిన ఓ సంఘ‌ట‌న‌ను చెపుతూ.. మ‌గాడు సినిమా షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో రాజ‌శేఖ‌ర్‌కు ప్ర‌మాదం జ‌రిగింద‌ట‌.. ఆ ప్ర‌మాదంలో రాజ‌శేఖ‌ర్‌కు తీవ్ర గాయాల‌య్యాట‌.. అప్పుడు ఆయ‌న‌ను ఆస్ప‌త్రిలో జాయిన్ చేస్తే ఆయ‌న వ‌ద్ద ఎవ్వ‌రు లేర‌ట‌. రాజ‌శేఖ‌ర్ త‌ల్లిదండ్రులు ఊర్లో లేర‌ట‌.. అప్పుడు స‌ర్జ‌రీ చేసినప్పుడు జీవితే అన్ని చూసుకుంద‌ట‌.. ఆయ‌న త‌ల్లి వ‌చ్చిన సంద‌ర్భంలో జీవిత ఫ్రాడ్ అని పిలిచింద‌ట‌.. దీంతో రాజ‌శేఖ‌ర్ త‌ల్లి ఆమేపై గ‌రం గ‌రం అయింద‌ట‌.. దీంతో అప్ప‌టి నుంచి ఫ్రాడ్ అని బంద్ చేసి బంగారం అని పిల‌వ‌డం అల‌వాటు చేసుకుంద‌ట‌.. సో ఫ్రాడ్ బంగారం అయ్యాడ‌ట‌…

ఆ టాలీవుడ్ సీనియర్ హీరో ఫ్రాడ్ అంటున్న న‌టి జీవిత‌…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts