ఒకే వేదికపై ఎన్టీఆర్ చరణ్ డాన్స్ …అభిమానులకు పండగే

October 21, 2019 at 6:05 pm

బాలీవుడ్‌లో ఇప్ప‌టికే త‌న‌కంటూ ఓ గుర్తింపు ఉన్న టాలీవుడ్ హీరో ఒక‌రు.. ఒక‌రెమో టాలీవుడ్‌లో తిరుగులేని హీరో.. ఈ ఇద్ద‌రు క‌లిసి ఓ బాలీవుడ్ సూప‌ర్‌స్టార్‌తో క‌లిసి కాలు క‌దుప‌నున్నారు. అంటే ఈ టాలీవుడ్ టాప్ హీరోలు బాలీవుడ్ సినిమాలో న‌టించ‌బోతున్నారని అనుకుంటున్నారా.. అదేం కాదండి.. ఈ ఇద్ద‌రు టాలీవుడ్ టాప్ హీరోలు బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ తో క‌లిసి డ్యాన్స్ చేయ‌బోతున్నారు. దీనికి వేధిక కూడా ఖ‌రారైంది..

ఇంత‌కు ఈ టాప్ హీరోలు ఎవ్వ‌రు.. బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ హీరో ఎవ‌రు అనుకుంటున్నారా… న‌వంబ‌ర్ 2న హైద‌రాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో దబాంగ్ 3 సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్నారు. ఈ చిత్ర ప్ర‌మోష‌న్‌లో టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఇద్ద‌రు పాల్గొని డ్యాన్స్ చేయ‌నున్నారు. ఇద్ద‌రు క‌లిసి ఆర్ ఆర్ ఆర్ సినిమాలో క‌లిసి న‌టిస్తున్నారు.. కానీ ఇద్ద‌రు క‌లిసి డ్యాన్స్ చేసే సీన్ అందులో ఉందో లేదో రాజమౌళికి తెలియాలి..

కానీ అంత‌క‌న్నా ముందే ద‌బాంగ్ 3 సినిమా ప్ర‌మోష‌న్‌లో మాత్రం ఇద్ద‌రు క‌లిసి డ్యాన్స్ చేయ‌బోతున్నారు. బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తున్న‌దబాంగ్ 3 చిత్రాన్ని ఇండియ‌న్ మైకేల్ జాక్స‌న్ ప్ర‌భుదేవా రూపొందిస్తున్నారు. అయితే స‌ల్మాన్‌ఖాన్ చిత్రం ప్ర‌మోష‌న్ కోసం తార‌క్‌, రామ్ చ‌ర‌ణ్ లు స‌ల్మాన్‌ఖాన్ తో క‌లిసి వేధిక పంచుకోబోతున్నార‌నే వార్త ఇప్పుడు ఫిలింన‌గ‌ర్ లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతుంది. ఇది ఆర్ ఆర్ ఆర్ మూవీ కోసం ముందుగానే ఇద్ద‌రు టాప్ హీరోలు వేస్తున్న స్టెప్‌గానే అర్థం అవుతుంది.

ఒకే వేదికపై ఎన్టీఆర్ చరణ్ డాన్స్ …అభిమానులకు పండగే
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts