క‌ళ్యాణ్ రామ్ ` ఎంత మంచివాడ‌వురా ` ప్రీ రిలీజ్ బిజినెస్‌

October 19, 2019 at 10:43 am

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న `ఎంత మంచివాడవురా` సినిమాకు ట్రేడ్ వర్గాల్లో అదిరిపోయే పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. శతమానం భవతి లాంటి సూపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాను తెరకెక్కించిన సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో, ట్రేడ్ వర్గాల్లో పాజిటివ్ బ‌స్ ఏర్ప‌డింది. కళ్యాణ్ రామ్ సరసన మెహరిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఉత్తరాంధ్ర నుంచి 1.62 కోట్ల కు బిజినెస్ డీల్ క్లోజ్ అయింది.

గాయత్రి ఫిలిమ్స్ ఉత్తరాంధ్ర రైట్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇక టోటల్‌గా ఆంధ్ర ఏరియాకు రు. 8 కోట్ల రేషియోలో మార్కెట్ చేసినట్టు తెలుస్తోంది. సంక్రాంతికి పోటీ సినిమాల నేపథ్యంలో ఆంధ్ర ఏరియా నుంచి కళ్యాణ్ రామ్ సినిమాకు రు. 8 కోట్ల బిజినెస్ డీల్ అంటే చాలా మంచి రేటు అని చెప్పాలి. ఇటీవల కళ్యాణ్ రామ్ సినిమాలకు ఆంధ్రాలో రు. 5 నుంచి 6 కోట్ల రేంజ్‌కు మించి మార్కెట్ కావడం లేదు.

ఇటీవల ఉత్తరాంధ్రలో తెలుగు సినిమాల మార్కెట్ బాగా పెరిగింది. అలాంటి సినిమా సైతం రు. 14 కోట్ల వసూళ్లను క్రాస్ చేసింది. దీంతో రెగ్యులర్ లెక్కలు పక్కన పెట్టి మరీ.. ఉత్తరాంధ్రలో మీడియం హీరోల సినిమాలకు సైతం భారీ రేట్లు పెడుతున్నారు. ఏదేమైనా సంక్రాంతి పెద్ద సినిమాల మధ్యలో రిలీజ్ అవుతున్న కళ్యాణ్ రామ్ `ఎంత మంచివాడవురా` బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ నమోదు చేస్తుందో ?చూడాలి.

క‌ళ్యాణ్ రామ్ ` ఎంత మంచివాడ‌వురా ` ప్రీ రిలీజ్ బిజినెస్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts