కార్తీ “ఖైదీ ” రివ్యూ &రేటింగ్

October 25, 2019 at 4:15 pm

నటీనటులు: కార్తీ, నరేన్ కుమార్, హరీష్ ఉత్తమన్, హరీష్ పేరడి తదితరులు
సంగీతం: సామ్ సి.ఎస్
ఛాయాగ్రహణం: సత్యన్ సూర్యన్
నిర్మాతలు: ఎస్.ఆర్.ప్రభు – రాధామోహన్
దర్శకత్వం: లోకేష్ కనకరాజ్
రిలీజ్ డేట్‌: 25 అక్టోబ‌ర్‌, 2019

తెలుగులో ఒక‌ప్పుడు మంచి క్రేజ్ తెచ్చుకున్న కార్తీ గ‌త కొద్ది రోజులుగా వ‌రుస ప్లాపుల‌తో ఎదురు దెబ్బ‌లు తింటున్నారు. ఊపిరి, ఖాకీ సినిమాల‌ త‌ర్వాత కార్తీ నుంచి ఆ రేంజ్ సినిమా రాలేదు. ఇప్పుడు ఖైదీ లాంటి యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. మెగాస్టార్ చిరు సూప‌ర్ హిట్ టైటిల్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా ప్రోమోలు ఎట్రాక్టివ్‌గా ఉన్నాయి. ఈ రోజు విజ‌య్ విజిల్ సినిమాకు పోటీగా వ‌చ్చిన ఖైదీ ప్రేక్ష‌కుల‌ను ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుందో ? స‌మీక్ష‌లో చూద్దాం.

క‌థ‌:
ఒక యావ‌జ్జీవ కారాగార శిక్ష ప‌డ్డ ఖైదీ ఢిల్లీ బాబు (కార్తీ) ప‌దేళ్ల శిక్ష పూర్త‌య్యాక స‌త్ప్ర‌వ‌ర్త‌న‌తో రిలీజ్ అవుతాడు. అప్ప‌టి వ‌ర‌కు త‌న కూతురుని చూడ‌ని బాబు కూతురు కోసం త‌హ‌త‌హ‌లాడుతుండ‌గా ఒక్క‌సారిగా పెద్ద ప్ర‌మాదంలో చిక్కుకున్న 40 మంది పోలీసుల‌ను కాపాడాల్సిన పెద్ద బాధ్య‌త అత‌డిపై ప‌డుతుంది. ఈ పెద్ద ప్ర‌మాదం వెన‌క అస‌లు నిజం ఏంటి ? ఆ పోలీసులను ఢిల్లీ బాబు కాపాడాడా ? లేదా.. తన కూతురిని కలిశాడా లేదా అన్నది మిగతా కథ.

విశ్లేష‌ణ :
సందీప్‌కిష‌న్‌తో న‌గ‌రం లాంటి వైవిధ్య‌మైన సినిమాను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్ ఖైదీ సినిమా కోసం ఎంచుకున్న క‌థ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఈ క‌థ రెండున్న‌ర గంట‌ల క‌థ రాత్రి వేళ కొన్ని గంటల్లోనే ముగిసిపోతుంది. ఇంత టైంలో ఒక్క పాటు ఉండ‌దు.. హీరోయిన్ క‌నిపించ‌దు.. అస‌లు రొమాన్సే ఉండ‌దు. అస‌లు హీరో గ‌తం ఏంటో చెప్పేందుకు రెండు నిమిషాల డెప్త్ సంభాష‌ణ‌ల‌తోనే స‌రిపెట్టేశాడు. అది అర్థ‌వంతంగా ఉంది కూడా..! ఎక్కడా క‌న్నార్ప‌కుండా బిగి స‌డ‌ల‌ని రేసీ స్క్రీన్ ప్లేతో ప్రేక్ష‌కుడిని తెర‌పై నుంచి ప‌క్క‌కు చూపు మ‌ర‌ల‌కుండా టైట్ నెరేష‌న్‌తో రెండున్న‌ర గంట‌ల పాటు మెస్మ‌రైజ్ చేశాడు.

సినిమా ప్రారంభ‌మైన 10 నిమిషాల‌కే హీరో టాస్క్ ఏంటో అర్థ‌మైపోతుంది. క‌థా ప‌రంగా క్లుప్తంగా చూస్తే మత్తు మందు కలిపిన మద్యం తాగిన పోలీసుల్ని ఎవరికీ తెలియకుండా ఆసుపత్రికి తీసుకెళ్లడం.. ఆ తర్వాత భారీగా డ్రగ్స్ నిల్వ ఉన్న పోలీస్ కార్యాలయానికి చేరుకుని అక్కడున్న వాళ్లను కాపాడి సరుకు కాపాడ‌డ‌మే స్టోరీ. ఈ జ‌ర్నీలో అత‌డు ఎలాంటి ? ఇబ్బందులు ఎదుర్కొన్నాడ‌న్న‌దే క‌థాంశం. సినిమాలో కావాల్సినంత యాక్ష‌న్ ఉండ‌డంతో యాక్ష‌న్ ప్రియులు బాగా ఖుషీ అవుతారు. ఇక తండ్రి, కూతుళ్ల మ‌ధ్య వ‌చ్చే ఎమోష‌న్ సీన్లు సూప‌ర్బ్‌.

ఫ‌స్టాఫ్‌లో సినిమా కాస్త స్లో అయినా సెకండాఫ్‌లో మాత్రం రేసీ స్క్రీన్ ప్లేతో ప‌రుగులు పెడుతుంది. సెకండాఫ్‌లో ప్రేక్ష‌కులు విజిల్స్ వేస్తూ, క్లాప్స్ కొట్టే సీన్లు సినిమాకే హైలెట్‌. క్లైమాక్స్ లో మెషీన్ గన్ సీన్ సినిమాకే హైలైట్. హీరో, కూతురు మ‌ధ్య వ‌చ్చే ముగింపు స‌న్నివేశాలు మ‌న‌స్సును ట‌చ్ చేస్తాయి. సినిమాలు లాజిక్‌కు అంద‌ని సీన్లు కొన్ని ఉన్నా అవి పెద్ద ప‌ట్టింపేం కాదు. ఇక రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాకు అల‌వాటు ప‌డ్డ వాళ్లు ఖైదీని ఎంత వ‌ర‌కు ఎంజాయ్ చేస్తార‌న్న‌ది చూడాలి. క‌థ‌, క‌థ‌నాల‌కు క‌ట్టుబ‌డి, స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగే యాక్షన్ థ్రిల్లర్లను ఇష్టపడేవాళ్ల‌కు ఇది ఖ‌చ్చితంగా న‌చ్చుతుంది.. వాళ్లు మెచ్చేలా ఉంటుంది.

న‌టీన‌టుల పెర్పామెన్స్ :
కార్తీ సినిమాల్లోనే ఖైదీ అత‌డిని ఓ ప్ర‌త్యేక‌మైన న‌టుడిగా నిల‌బెడుతుంది. త‌న కుటుంబానికి జ‌రిగే అన్యాయం గురించి ఉద్వేగంతో చెప్పే సీన్ల‌లో అత‌డి న‌ట‌న హైలెట్‌. ఇంకా కూతురిని తలుచుకునే ప్రతి సన్నివేశంలోనూ కార్తీ న‌ట‌న మెప్పిస్తుంది. హీరోతో పాటు ట్రావెల్ అయ్యే పోలీస్ అధికారిగా నరేన్‌తో పాటు
హరీష్ ఉత్తమన్‌కు చిన్న పాత్రే దక్కింది. మిగతా నటీనటులుందరూ బాగానే చేశారు.

టెక్నిక‌ల్‌గా చూస్తే…
టెక్నిక‌ల్‌గా అన్ని విభాగాలు సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. సామ్ సి.ఎస్ నేపథ్య సంగీతం సన్నివేశాల్ని ఎలివేట్ చేసింది. సత్యన్ సూర్యన్ ఛాయాగ్రహణం గురించి చెప్పడానికి చాలా ఉంది. పూర్తిగా రాత్రి పూట సాగే సినిమాలో ప్రతి సన్నివేశంలోనూ ఛాయాగ్రాహకుడి కష్టం.. ప్రతిభ కనిపిస్తాయి. ఇలాంటి క‌థ‌ను న‌మ్మి ఖ‌ర్చు పెట్టిన నిర్మాత ప్ర‌భును మెచ్చుకోవాలి. మా నగరం (తెలుగులో నగరం)తో సత్తా చాటిన లోకేష్ కనకరాజ్ ఇలాంటి క‌థ‌ను తీసినందుకు ఎంత పొగిడినా త‌క్కువే.

ఫైన‌ల్‌గా…
ఖైదీ ఎమోష‌న‌ల్‌… యాక్ష‌న్ థ్రిల్లింగ్ జ‌ర్నీ

ఖైదీ TJ రేటింగ్‌: 3 / 5

కార్తీ “ఖైదీ ” రివ్యూ &రేటింగ్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts