కేసీఆర్ జ‌గ‌న్‌ను చూసి నేర్చుకో… కేసీఆర్ ఫ్రెండ్ షాకింగ్ కామెంట్స్‌

October 9, 2019 at 5:26 pm

తెలంగాణ‌లో రాజ‌కీయం రోజు రోజుకు స‌రికొత్త ట్విస్టుల‌తో రంజుగా మారుతోంది. సూర్యాపేట జిల్లా హుజూర్‌న‌గ‌ర్ అసెంబ్లీ స్థానానికి జ‌రుగుతోన్న ఉప ఎన్నిక అటు సీఎంగ కేసీఆర్‌కు, ఇటు పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి రాజీనామాతో ఆయ‌న‌కు స‌వాల్‌గా మారింది. ఈ ఉప ఎన్నిక‌ల్లో గెలిచి ఉత్త‌మ్ కంచుకోట బ‌ద్ద‌లు కొట్టేందుకు కేసీఆర్ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌మ పార్టీ నేత‌ల‌ను సీపీఐ ఆఫీస్‌కు పంపి వారిని ఒప్పించి మ‌రీ త‌మ‌కు మ‌ద్ద‌తు తెలిపేలా చేయ‌డంలో స‌క్సెస్ అయ్యారు.

దీంతో టీఆర్ఎస్‌, సీపీఐ నేత‌లు క‌లిసి ఉప ఎన్నిక‌ల్లో ప్ర‌చారం ప్రారంభించారు. అంత‌లోనే ఆ పార్టీకి అదిరిపోయే షాక్ ఇచ్చింది సీపీఐ. తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బుధవారం సోమాజీగూడ ప్రెస్‌ క్లబ్‌లో కోదండరాం అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ఈ స‌మావేశానికి ప‌లు పార్టీల‌కు చెందిన కీల‌క నేత‌లు హాజ‌రై కేసీఆర్‌పై తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్‌ మద్దతిచ్చే అంశంపై తమ పార్టీ పునరాలోచన చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు.

ఆర్టీసీ కార్మికుల తొల‌గింపు నిర్ణ‌యాన్ని కేసీఆర్ వెంట‌నే వెన‌క్కు తీసుకోవాల‌ని… తాము హుజూర్‌న‌గ‌ర్లో టీఆర్ఎస్‌కు మ‌ద్ద‌తు ఇచ్చిన‌ప్పుడు ఆర్టీసీ స‌మ్మె నోటీసు మాత్ర‌మే ఇచ్చిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. అయితే ఇప్పుడు ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం ఎంత మాత్రం స‌రైంది కాద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఈ సమావేశంలో పలు పార్టీల, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని కేసీఆర్‌ వైఖరిని వారు తప్పుబట్టారు.

నిన్న కాక మొన్న ఉప ఎన్నిక‌ల వ‌ర‌కు తాము టీఆర్ఎస్‌కు, కేసీఆర్‌కు స‌పోర్ట్ చేస్తామ‌ని… తాము బాయి.. బాయి అని చెప్పిన సీపీఐ ఇప్పుడు స‌డెన్‌గా టీఆర్ఎస్ షాక్ ఇచ్చేలా రివ‌ర్స్ గేర్ వేసింది. చాడ అయితే కేసీఆర్ మాట‌లు వింటుంటే న‌వ్వు వ‌స్తోంద‌ని కూడా ఎద్దేవా చేశారు. ఈ నేప‌థ్యంలోనే చాట ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి కేసీఆర్‌కు లింక్ పెట్టి కూడా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పనులను చూసి కేసీఆర్‌ ఎంతో కొంత నేర్చుకోవాలని సూచించారు. ఏదేమైనా మూడు రోజుల క్రితం టీఆర్ఎస్‌కు స‌పోర్ట్ చేసిన సీపీఐ ఇప్పుడు అదే పార్టీకి వార్నింగ్ ఇస్తుండంతో హుజూర్‌న‌గ‌ర్ రాజ‌కీయం ఆస‌క్తిగా మారింది.

కేసీఆర్ జ‌గ‌న్‌ను చూసి నేర్చుకో… కేసీఆర్ ఫ్రెండ్ షాకింగ్ కామెంట్స్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts