కోర్టులో కేజీఎఫ్ భ‌విత‌వ్యం…!

October 3, 2019 at 12:07 pm

కేజీఎఫ్ సినిమా సృష్టించిన ప్ర‌కంప‌న‌లు అంతా ఇంతాకాదు.. ఓ కన్నడ చిత్రం కె.జీ.ఎఫ్ చాప్టర్ 1 దేశ వ్యాప్తంగా ప్రేక్షకులకు అల‌రించింది. సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా యష్ కు అన్ని భాషల్లోనూ గుర్తింపు తీసుకొచ్చింది. కన్నడ చిత్ర సీమ స్థాయిని కూడా ఈ సినిమా ఒక్కసారిగా పెంచింది. ప్రస్తుతం ‘కె.జీ.ఎఫ్: చాప్టర్ 2 షూటింగ్ జరుపుకుంటోంది. మొదటి భాగం కంటే భారీ స్థాయిలో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ సినిమాకు క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు..

కేజీఎఫ్ 2 సినిమా ను స‌య‌నైడ్ హిల్స్‌లో షూటింగ్ జ‌రుపుకునేందుకు సిద్ద‌మైంది చిత్ర యూనిట్. కానీ అక్క‌డి ప్ర‌జ‌లు షూటింగ్‌ను అడ్డుకున్నారు. సినిమా కోసం వేస్తున్న సెట్ల‌తో ప‌ర్యావ‌ర‌ణం దెబ్బ‌తింటుంద‌ని ప్ర‌జ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేయ‌డంతో కేజీఎఫ్ టీం కోర్టును ఆశ్ర‌యించింది. అయితే కోర్టు కేజీఎఫ్ టీం సినిమా షూటింగ్ జ‌రుపుకునేందుకు అనుమ‌తి ఇస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో సినిమా ప్రారంభించాల‌ని అనుకుంటున్న స‌మ‌యంలో మ‌రో అవాంతరం వ‌చ్చి ప‌డింది…

కేజీఎఫ్ సినిమాలో రౌడీ తంగం అనే వ్య‌క్తి కి సంబంధించిన నిజ జీవిత గాథ తో ఓ పాత్ర ఉంద‌ట‌. అయితే కేజీఎఫ్ ఛాప్ట‌ర్ 1 షూటింగ్‌స‌మ‌యంలోనే ఈ రౌడీ తంగం కుటుంబీకులు పెద్ద గొడ‌వ చేశార‌ట‌. ఎందుకంటే ఈ సినిమాలో రౌడీ తంగంను పెద్ద రౌడీగా చూపి మా కుటుంబాన్ని ఇన్‌సల్ట్ చేసార‌ని ఆందోళ‌న చెందారు. అయితే ఈ కేజీఎఫ్ 2లో రౌడీ తంగం పాత్ర‌ను ఇంకా హీనంగా చూపుతార‌నే ఆలోచ‌న‌తో కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న‌తో కోర్టును ఆశ్ర‌యించార‌ట‌. అయితే కోర్టు తీర్పు ఎలా ఉంటుందో వేచిచూడాల్సిన ప‌రిస్థితి ఇప్పుడు కేజీఎఫ్ టీమ్‌దీ..

కోర్టులో కేజీఎఫ్ భ‌విత‌వ్యం…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts