బ్రేకింగ్‌: లొంగిపోయిన కోడెల శివ‌రాం

October 1, 2019 at 1:13 pm

టీడీపీ దివంగత నేత, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం మంగళవారం కోర్టు ఎదుట లొంగిపోయారు. గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా గుంటూరు జిల్లాలో జంట నియోజ‌క‌వ‌ర్గాలుగా ఉన్న స‌త్తెన‌ప‌ల్లితో పాటు న‌ర‌సారావుపేట‌లో కోడెల శివ‌రాం కే ట్యాక్స్ పేరుతో భారీగా వ‌సూళ్లు రాబ‌ట్టార‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. ఈ క్ర‌మంలోనే కోడెల కుమారుడు శివ‌రాంతో పాటు ఆయ‌న కుమార్తె పూనాటి విజ‌య‌ల‌క్ష్మిపై సైతం ఈ ఆరోప‌ణ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఆయనపై వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలో ఐదు కేసుల విషయమై తనకు బెయిల్‌ ఇవ్వాల్సిందిగా కోడెల శివరాం హైకోర్టును ఆశ్రయించారు. కోడెల త‌న‌యుడు గ‌త రెండు నెల‌లుగా బెయిల్ రాక‌పోవ‌డంతో త‌ప్పించుకుని తిరుగుతూనే ఉన్నాడు. శివ‌రాం బెయిల్ కోసం పెట్టుకున్న ఫిటిష‌న్ నేప‌థ్యంలో ఆయన అభ్యర్థనపై స్పందించిన హైకోర్టు.. శివరాంను కింది కోర్టులో లొంగిపోవాల్సింగా సూచించింది.

అయితే శివ‌రాం బెయిల్ రాక‌పోవ‌డంతో విదేశాలకు వెళ్లిపోయారు. ఆయ‌న కెన్యాలో ఉండ‌గానే ఆయ‌న తండ్రి శివ‌ప్ర‌సాద్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఇక చివ‌ర‌కు ఆయ‌న కెన్యా నుంచి వ‌చ్చి తండ్రికి అంత్య‌క్రియ‌లు చేశారు. ఇక తాజాగా కోడెల శివరాం మంగ‌ళ‌వారం నరసరావుపేట ఫస్ట్‌ మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో లొంగిపోయారు.

కాగా భారీగా కోడెల ఫ్యామిలీ బాధితులు కోడెల కుటుంబంపై ఫిర్యాదు చేయడం, సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత, పార్టీ అధిష్టానం సైతం తనను పట్టించుకోకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే.

బ్రేకింగ్‌: లొంగిపోయిన కోడెల శివ‌రాం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts