మెగాస్టార్ వైపు చూస్తున్న మా…!

October 21, 2019 at 11:54 am

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా)లో వ‌ర్గ విభేదాలు జోరుగా సాగుతున్నాయి. ఈ వ‌ర్గ విభేదాలకు కేంద్ర బిందువులుగా మా అధ్య‌క్షుడు సీనియ‌ర్ న‌రేష్‌, న‌టి జీవితా రాజ‌శేఖ‌ర్‌లు మారారు. ఇంత‌కాలం ఎలాంటి విభేదాలు లేకుండా సాగిన మాలో ఇప్పుడు వ‌ర్గ విభేదాలు పొడ‌చూప‌డంతో మా వ్య‌వ‌హారం ఇప్ప‌డు మెగాస్టార్ చిరంజీవి కి చుట్టుకుంది. మా లో ఎప్పుడు ఎలాంటి చిన్న చిన్న గొడ‌వ‌లు జ‌రిగినా వాటిని ద‌ర్శ‌క‌ర‌త్న దాసరి నారాయ‌ణ‌రావు చ‌క్క‌దిద్దేవారు.

ఏ స‌మ‌స్య వ‌చ్చినా, టాలీవుడ్‌లో ఏ కార్యక్రమమైనా చేపట్టాలన్నా, పంచాయితీలు చేయాలన్నా దర్శకరత్న దాసరి నారాయణరావు పెద్ద‌త‌ర‌హాగా వ్య‌వ‌హ‌రించి ఓవైపు అంద‌రికీ స‌ర్ధి చెప్పుతూ త‌గిన‌ సలహాలు, సూచనలు ఇస్తూ ఉండేవారు.. కానీ ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. అయితే దాస‌రి మ‌ర‌ణంలో మా కు పెద్ద దిక్కుగా మెగాస్టార్ చిరంజీవి, రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజులు మారారు. అయితే మెగాస్టార్ చిరంజీవి మా లో నెల‌కొన్న స‌మస్య‌లు ప‌రిష్క‌రిస్తార‌ని మా స‌భ్యులు ఎదురుచూస్తున్నారు.

అయితే మెగాస్టార్ చిరంజీవి కూడా మా పై స్పందించాలంటే మా క‌మిటీ ఓసారి క‌లిస్తే వాటిని ప‌రిష్క‌రించే అవ‌కాశం ఉంటుంది. మా లో జ‌రుగుతున్న తంతును గ‌మ‌నిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు ముందుకు వ‌చ్చేందుకు సిద్ద‌మ‌వుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే స‌మ‌స్య‌ను జ‌ఠిలం కాకుండా చూడాల్సిన మెగాస్టార్ త‌మ్ముడు నాగ‌బాబు చేసిన కామెంట్లు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.. సో ఓవైపు వ‌ర్గ విభేదాల‌తో సాగుతున్న మా ను చ‌క్క‌దిద్దేక్ర‌మంలో నాగ‌బాబు వ్య‌వ‌హ‌రం చిక్కుముడిగా మారింది. ఇప్పుడు నాగ‌బాబును సైడ్ చేసి మెగాస్టార్ మా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని మా స‌భ్యులు కోరుతున్నారు..

మెగాస్టార్ వైపు చూస్తున్న మా…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts