మహేష్ కొత్త ఎత్తుగడ ఫలిస్తుందా ?

October 21, 2019 at 4:16 pm

ప్రిన్స్ మ‌హేష్ బాబు వేస్తున్న ఎత్తుల‌కు, ఎత్తుగ‌డ‌ల‌కు తిరుగులేదా…? టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు సంక్రాంతికి చేయ‌బోయే మాయ ఏమిటో ఎవ్వ‌రికి అంతు చిక్క‌కుండా ఉంది.. ఇప్ప‌టికే సంక్రాంతికి దాదాపుగా అర‌డ‌జ‌న్ సినిమాలు రాబోతున్న త‌రుణం.. ఇంత పోటీలో ప్రిన్స్ మ‌హేష్ బాబు ప్ర‌ధాన పోటీగా కేవ‌లం స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్‌ను మాత్ర‌మే భావిస్తున్నాడు.

అందుకే ప్రిన్స్ మ‌హేష్ బాబు ఇప్పుడు ఒక కొత్త ఎత్తుగ‌డ వేశార‌ని ప్ర‌చారం.. ఇప్ప‌టికే బ‌న్నీ వేస్తున్న ఎత్తుల‌కు పై ఎత్తు ఎలా వేయాలో ఆలోచ‌న చేసిన మ‌హేష్ బాబుకు ఓ కొత్త ఆలోచ‌న త‌ట్టింది. ఈ ఎత్త‌గ‌డ స‌క్సెస్ అయితే.. ప్రిన్స్‌కు తిరుగు లేద‌నే టాక్ వినిపిస్తుంది.. ఇంత‌కు ప్రిన్స్ మ‌హేష్ బాబు వేసిన ఎత్తుగ‌డ ఏంటో అనే చ‌ర్చ ఆంద‌రిని తొలుస్తున్న ప్ర‌శ్న‌..

అల్లు అర్జున్ న‌టిస్తున్న చిత్రం అల వైకుంఠ‌పురం. ఈ సినిమా మ‌హేష్ బాబు న‌టిస్తున్న స‌రిలేరు నీకెవ్వరు. అల్లు అర్జున్ ఇప్ప‌టికే సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న అనే పాట‌ను విడుద‌ల చేసి రికార్డు దిశ‌గా దూసుకెళుతున్నారు. మ‌రో ఒక‌టి రెండు రోజుల్లో మ‌రో పాట‌ను విడుద‌ల చేసేందుకు స‌న్న‌హాలు చేస్తున్నారు. అయితే ఈ పాటలు విని విని ప్రేక్ష‌కులకు బోర్ కొడుతాయ‌ని, అందుకే పాట‌ల‌ను ఇప్పుడు విడుద‌ల చేయ‌కుండా సినిమా విడుద‌ల‌కు ముందు పాట‌లు విడుద‌ల చేస్తే అభిమానుల్లో క్రేజ్ రావ‌డంతో పాటు.. ప్రెష్‌గా ఉంటాయ‌ని ప్రిన్ భావ‌న‌. అందుకే స‌రిలేరు నీకెవ్వ‌రు పాట‌లు, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌లు ఇప్పుడు డిసెంబ‌ర్ నెల‌లో విడుద‌ల చేయాలనే మ‌హేష్ ఆలోచ‌న ఎలా వ‌ర్క‌ట్ అవుతుందో వేచి చూద్దాం…

మహేష్ కొత్త ఎత్తుగడ ఫలిస్తుందా ?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts