ఆ జిల్లా మ‌గ సెక్స్ వ‌ర్క‌ర్ల‌కు అడ్డా… ఎంత దారుణం అంటే..!

October 21, 2019 at 12:28 pm

భారతీయ సమాజం తీరు రోజు రోజుకు మారుతోంది. ఇక్క‌డ పాశ్యాత్య సంస్కృతి ఎక్కువ అవుతోంది. ఇక్క‌డ లైంగీక ధోర‌ణులు పెడ‌దోవ ప‌డుతున్నాయి. స్వలింగ సంపర్కులు వివాహేతర సంబంధాలు పెట్టుకుంటే తప్పేంటనే మహిళలు పెరుగుతున్నారు. సెక్స్ కొనుక్కోవడమూ ఎక్కువవుతోంది. ఈ క్ర‌మంలోనే మ‌గ సెక్స్ వ‌ర్క‌ర్లు కూడా పెరిగిపోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే కేర‌ళ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ చేప‌ట్టిన స‌ర్వేలో ఆస‌క్తిక‌ర అంశం వెల్ల‌డైంది.

ఈ మ‌గ సెక్క్స్ వ‌ర్క‌ర్ల పెరుగుదలతో పెద్ద ఆందోళ‌న‌గా మారింది. తాజాగా కేరళ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ చేపట్టిన ఓ సర్వేలో ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి. ముఖ్యంగా ఆ రాష్ట్రంలో మహిళా సెక్స్ వర్కర్లు ఎంత మంది ఉన్నారో పురుష సెక్స్ వ‌ర్క‌ర్లు కూడా అంతే మంది ఉన్న‌ట్టు స‌ర్వే స్ప‌ష్టం చేసింది. కేర‌ళ‌లో రోజు రోజుకు పెరుగుతోన్న నిరుద్యోగంతో పాటు ఆర్థికంగా చితికిపోతున్న వారి సంఖ్య ఎక్కువ అవ్వ‌డంతో పాటు ఆ రాష్ట్రం ప‌ర్యాట‌కంగా అభివృద్ధి చెందుతుండ‌డంతో అక్క‌డ సెక్క్ వ‌ర్క‌ర్ల సంఖ్య పెరుగుతోంది.

ప్ర‌స్తుతం కేరళలో 17 వేల మంది మహిళా సెక్స్ వర్కర్లు ఉండగా.. 13331 మంది మగవారు ఉన్నారు. ఇక దేశంలో ఇత‌ర ప్రాంతాల నుంచి కేర‌ళ‌కు వెళ్లే సెక్స్ వ‌ర్క‌ర్ల సంఖ్య కూడా పెరుగుతోంద‌ట‌. ఇక గ్రామీణ ప్రాంతాల నుంచి ఆర్థికంగా చితికిపోయిన వారు ప‌ట్ట‌ణాల‌కు వెళ్లి అక్క‌డ సెక్క్స్ వ‌ర్క‌ర్లుగా మారుతున్నార‌ని ఈ స‌ర్వే చెప్పింది. సెక్స్ వర్కర్లలో ఎక్కువగా 36-46 మధ్య వయస్కులున్నట్లు గుర్తించారు. నగరాల్లోని హోటళ్లు ఫ్లాట్లలో ఉంటూ ఆ పనిని చేస్తున్నారట.

ఇక వ‌య‌స్సు పైబ‌డ్డాక చాలా మంది అమ్మాయిల బ్రోక‌ర్లు, ఏజెంట్లుగా మారుతున్నారు. బెంగాల్ బీహార్ ఒడిశా నుంచి వచ్చిన మహిళా సెక్స్ వర్కర్లు క్రమంగా తమ పరిచయస్థులు బంధువులనూ ఈ వృత్తిలో దించుతున్నార స‌ర్వే వెల్ల‌డించింది. ఇక ప్ర‌స్తుతం కేర‌ళ‌లో ఎక్కువ మంది బెంగాల్ సెక్క్స్ వ‌ర్క‌ర్లే ఉంటున్నార‌ని తేలింది. ఇక ఈ సెక్స్క్ వ‌ర్క‌ర్ల‌లో ఎక్కువ మంది డ్ర‌గ్స్‌కు అల‌వాటు ప‌డుతుండ‌గా…. కొంద‌రు హెచ్ఐవీకు గురయ్యార‌ని కూడా తెలుస్తోంది.

ఒక కేరళ రాష్ట్రంలో మాత్రమే కాదు మెట్రో నగరాల్లో చాలావరకు మగ సెక్స్ వర్కర్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇక వీరు వ్యభిచారం సాగించడం కోసం అన్ని రకాల వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. ఈ పరిస్థితులు మారకుంటే భవిష్యత్తులో చాలా ఇది తీవ్ర పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.

ఆ జిల్లా మ‌గ సెక్స్ వ‌ర్క‌ర్ల‌కు అడ్డా… ఎంత దారుణం అంటే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts