బ్రేకింగ్‌: భార్య‌తో విడాకులు తీసుకున్న మంచు మ‌నోజ్‌

October 17, 2019 at 5:40 pm

టాలీవుడ్ యంగ్ హీరో కలెక్షన్ కింగ్ మంచుమోహ‌న్‌బాబు తనయుడు మంచు మనోజ్ తన భార్య ప్రణతితో విడాకులు తీసుకున్న విషయాన్ని అధికారికంగా కన్ఫామ్ చేశారు. కొద్దిరోజులుగా మనోజ్ ఆయన భార్య ప్రణతి కలిసి ఉండటం లేదని… వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని ప్రచారం జరుగుతోంది. భార్యతో ఏర్పడిన విభేదాల వల్లే మనోజ్ సరిగా సినిమాల‌పై కాన్‌సంట్రేష‌న్ చేయలేక పోతున్నార‌ని.. అందుకే మనోజ్ కొద్దిరోజులుగా కొత్త సినిమాలు కూడా ఒప్పుకోవటం లేదని ప్రచారం కొద్దిరోజులుగా టాలీవుడ్ లో జరుగుతోంది. ఈ వార్తలను ధృవీకరిస్తూ మనోజ్ కొద్దిసేపటి క్రితం తాను తన భార్య ప్రణతి నుంచి విడాకులు తీసుకున్న విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

ఇక ప్రణ‌తి సైతం కొద్దిరోజులుగా అమెరికాలోనే ఉంటున్నట్టు సమాచారం. భార్యతో విడాకులపై మనోజ్ స్పందిస్తూ ఈరోజు మీకు ముఖ్యమైన విషయం చెబుతానని… తన భార్య ప్రణతితో తాను విడాకులు తీసుకున్నానని మనోజ్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. తన వైవాహిక బంధం విడాకులతో ముగుస్తుందంటూ మనోజ్ ఎమోషనల్‌గా రాసుకొచ్చాడు. ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకోక త‌ప్ప‌డం లేదని చెప్పాడు. తాము ఒకరంటే ఒకరికి గౌరవం ఉందని కానీ తాము కలిసి అని తేల్చేశాడు.

తన మనస్సు సరిగా లేకపోవడం వల్లే తన వృత్తిపై సరిగా దృష్టి పెట్టలేక పోయానని… ఈ బాధలో తన కుటుంబం ఎప్పుడు తన వెంటే ఉందని… ఇకపై పూర్తిగా సినిమాలపై దృష్టి పెడతా అని చెప్పాడు. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు మనోజ్ కు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి సమయంలో మీరు ధైర్యంగా ఉండాలని… ఇవి జీవితంలో సహజంగానే జరుగుతూ వుంటాయని… వీటన్నింటినీ మర్చిపోయి త్వరలో మీరు వెండితెరపై ఎంట్రీ ఇవ్వాలని పోస్ట్ చేస్తున్నారు.

ఇక విష్ణు భార్య వెరినికాకు ఫ్రెండ్ అయిన ప్ర‌ణీత బిట్స్‌ఫిలానీలో ఇంజ‌నీరింగ్ కంప్లీట్ చేశారు. 2015లో వీరు పెళ్లి చేసుకున్నారు. ఆ త‌ర్వాత యేడాది నుంచే వీరిద్ద‌రు విడివిడిగా ఉంటున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

బ్రేకింగ్‌: భార్య‌తో విడాకులు తీసుకున్న మంచు మ‌నోజ్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts