మోడీ ద‌క్షిణాదిపై ఎందుకింత వివక్ష… హీరోయిన్ ఘాటు వ్యాఖ్యలు

October 21, 2019 at 5:00 pm

ఛేంజ్ విత్ ఇన్ కార్య‌క్ర‌మంతో ఏమీ సాధిద్దామ‌నుకున్నారో ఏమో గాని ప్ర‌ధానమంత్రిని మాత్రం ద‌క్షిణ భార‌త సిని ప‌రిశ్ర‌మ‌కు చెందినవారు రోజుకొక‌రు విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తున్నారు. దేశ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ గాంధీ 150 జ‌యంతిని పుర‌స్క‌రించుకుని బాలీవుడ్ న‌టుల‌తో ఛేంజ్ విత్ ఇన్ అనే కార్యక్ర‌మాన్ని శ‌నివారం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి బాలీవుడ్ కు చెందిన న‌టీన‌టులు భారీగానే హాజ‌ర‌య్యారు.

అయితే ఈ కార్య‌క్ర‌మాని ద‌క్షిణాది నుంచి చెప్పుకోద‌గిన ప్రాతినిధ్యం లేదు. తెలుగు ప‌రిశ్ర‌మ నుంచి ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు వంటివారు వెళ్ళారు. కానీ ద‌క్షిణ భార‌తంకు చెందిన సిని ప‌రిశ్ర‌మ న‌టులు మాత్రం ప్ర‌ధాని మంత్రి మోడీ తీరును త‌ప్పు ప‌డుతున్నారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కోడ‌లు, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణీ కొణిదెల ఉపాస‌న ఏకంగా దేశ ప్ర‌ధాని మోడీ తీరును విమ‌ర్శిస్తూ ద‌క్షిణ భారత సిని ప‌రిశ్ర‌మ‌ను కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని ట్వీట్ చేశారు..

ఇప్పుడు మెగా కోడ‌లు ఉపాస‌న బాట‌లో ప్ర‌ముఖ న‌టి కుష్బూ కూడా న‌డుస్తున్నారు. ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యంను ట్యాగ్ చేస్తూ కుష్బూ ద‌క్షిణ భార‌త సిని పరిశ్ర‌మ‌ను కూడా ఈ కార్య‌క్ర‌మానికి పిలిచి ఉంటే బాగుండేద‌ని ట్వీట్ చేశారు. భార‌త ఆర్దిక రంగానికి బాలీవుడ్ ఒక్క‌టే ప‌నిచేయ‌డం లేదు.. ద‌క్షిణ భార‌తం నుంచి ఎంద‌రో స్టార్ న‌టులు, టెక్నిషియ‌న్స్ ఉన్నారు.. వారిని కూడా ఈ కార్య‌క్ర‌మంలో భాగ‌స్వామ్యం చేసి ఉంటే బాగుండేది.. అంటూ ట్వీట్ చేసింది.. ఈ ట్వీట్‌తో ద‌క్షిణ భార‌త సిని ప‌రిశ్ర‌మ‌లోని న‌టీన‌టులు ఎంత నొచ్చుకుంటున్నారో అర్థ‌మ‌వుతుంది.

మోడీ ద‌క్షిణాదిపై ఎందుకింత వివక్ష… హీరోయిన్ ఘాటు వ్యాఖ్యలు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts