కళ్యాణ్ రామ్ ”ఎంత మంచివాడవురా ! ” టీజర్

October 9, 2019 at 10:54 am

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ న‌టించిన చిత్రం ఎంత మంచివాడ‌వురా.. టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ విజ‌య‌ద‌శ‌మి శుభాకాంక్ష‌ల‌తో విడుద‌ల చేసింది. ఈ చిత్రంలో క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న మెహ‌రీన్ న‌టిస్తుండ‌గా, సీనియ‌ర్ న‌రేష్‌, త‌నికెళ్ళ భ‌ర‌ణి, త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రం టీజ‌ర్ ఆక‌ట్టుకునేలా ఉంది. ఈ చిత్రంను ద‌ర్శ‌కుడు స‌తీష్ వేగ్నేష్ రూపొందిస్తున్నారు.

ఎంత‌మంచివాడ‌వురా.. అని మ‌న కుటుంబ స‌భ్యులు త‌మ‌వారిని పొగుడుతుంటే అ కిక్కే వేరు. అలాంటింది నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ బాలు పాత్ర‌లో మంచి అబ్బాయిగా న‌టిస్తున్నాడు. అయితే గ్రామంలో జ‌రిగే కొన్ని త‌గాదాల్లో త‌ల‌దూర్చుతుంటారు. అన‌వ‌స‌ర‌మైన త‌గాదాల్లో కాకుండా న్యాయ బ‌ద్ద‌మైన గొడ‌వ‌ల్లో మాత్ర‌మే త‌ల‌దూర్చి అంద‌రి చేత ఎంత‌మంచివాడ‌వురా అనిపించుకుంటాడ‌ట‌..

అయితే నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ న‌టించిన ఈ ఎంత‌మంచివాడ‌వురా సినిమా టీజ‌ర్‌ను 1.09నిమిషాల నిడివ‌వితో క‌ట్ చేశారు ద‌ర్శ‌కుడు స‌తీష్ విగ్నేష్‌. అంద‌రు మంచోడు అంటున్నారు.. మ‌రి ఇలా కొడుతున్నావేంట్రా అని విల‌న్ నాయ‌కుడు అంటుంటే.. రాముడు కూడా మంచివాడేరా.. కానీ రావ‌ణాసూరుడిని ఎసేయేలే.. అంటూ నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ చెప్పే డైలాగ్ ఆక‌ట్టుకునేలా ఉంది. చిత్రాన్ని శ్రీ‌దేవి మూవీస్ లో ర‌మేష్ గుప్తా, సుభాష్ గుప్తాలు నిర్మిస్తున్నారు.

కళ్యాణ్ రామ్ ”ఎంత మంచివాడవురా ! ” టీజర్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts