అందుకే వాటికి దూరంగా ఉంటానంటున్న టాలీవుడ్ హీరోయిన్…!

October 9, 2019 at 3:09 pm

ఆమే ద‌క్షిణాదిలో లేడా సూప‌ర్‌స్టార్ ఉన్న హీరోయిన్‌. వ‌య‌స్సు మీద ప‌డుతున్న కొద్ది పెద్ద హీరోల‌తో సినిమాలు చేస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థాయికి చేరుకున్న హీరోయిన్‌. ద‌క్షిణాదిలో అత్య‌ధిక పారితోషం తీసుకునే హీరోయిన్‌గా గుర్తింపు ఉంది. అంతే కాదు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ న‌టిస్తూనే మ‌రోవైపు హీరోయిన్‌గా న‌టిస్తూ త‌న ఇమేజ్‌ను పెంచుకుంటుంది. అయితే ఈ న‌టికి అవి అంటే భ‌య‌మ‌ట‌.. అందుకే వాటికి దూరంగా ఉంటుంద‌ట‌…

ఇంత‌కు లేడీ సూప‌ర్‌స్టార్ ఎవ‌రో మీకు అర్థ‌మ‌య్యే ఉంటుంది.. కాకుంటే వేటికి భ‌య‌ప‌డుతుందో ఓసారి చూద్దాం.. ద‌క్షిణాదిలో లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌కు అవి అంటే చాల భ‌య‌మ‌ట‌. అందుకే వాటికి ప‌దేళ్ళుగా దూరం ఉంటుంద‌ట అని బాంబ్ పేల్చింది.. ఇంత‌కు ఆమే వేటికి దూరం ఉంటుందంటే.. మీడియాకు ఇంట‌ర్వ్యూ ఇవ్వాలంటే భ‌య‌మ‌ట‌. ఎందుకంటే ఆ మీడియా న‌య‌న‌తార పై అనేక‌సార్లు త‌ప్పుడు వార్త‌లు రాసింద‌ట‌.

మీడియా రాసిన త‌ప్పుడు వార్త‌ల‌కు భ‌రించ‌లేక‌పోయేద‌ట‌. అందుకే మీడియాకు దూరంగా ఉంటుంద‌ట‌.. కానీ ఎందుకో ఈ మ‌ద్య మీడియా కోస‌మే ఫోటోషూట్‌లో క్లివేజ్ అందాల‌తో అద‌రగొట్టింది. ఇటీవ‌ల వోగ్ అనే మ్యాగ‌జైన్‌కు అందాలు ఆర‌బోసుకుంటూ ఫోటోలు దిగింది. ఓ ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. సినిమాల్లో న‌టించ‌డ‌మే త‌న వృత్తి.. తానేంటో త‌న సినిమాలే చెబుతాయి అంటూ చెబుతుంది. ఇప్పుడు న‌య‌న‌తార వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతుంది. త్వ‌ర‌లో పెండ్లి చేసుకుంటుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది.

అందుకే వాటికి దూరంగా ఉంటానంటున్న టాలీవుడ్ హీరోయిన్…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts