జగన్ విషయంలో పవన్ కు చిరు సలహా ఇదే !

October 21, 2019 at 12:47 pm

ఏపీ సీఎం జ‌గ‌న్‌ను మెగాస్టార్ చిరంజీవి క‌లిసిన త‌ర్వాత జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌లో ఏదో మార్పు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. జ‌గ‌న్ విష‌యంలో ప‌వ‌న్‌కు చిరు ఇచ్చిన స‌ల‌హా మేర‌కే ఆ మార్పు వ‌చ్చింద‌నే టాక్ బలంగా వినిపిస్తోంది. ఏమిటా మార్పు అంటే.. సీఎం జ‌గ‌న్‌పై, ప్ర‌భుత్వంపై కాస్త త‌గ్గి ఉండాల‌ని చిరు ఇచ్చిన స‌ల‌హా మేర‌కే ప‌వ‌న్ ఈ మధ్య సైలెంట్‌గా ఉంటున్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. నిజానికి.. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో దారుణ ఓట‌మి త‌ర్వాత కూడా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ జ‌నం ప‌క్షాన ఉండి మాట్లాడుతున్నారు.

ఇదే స‌మ‌యంలో సీఎం జ‌గ‌న్‌, ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇక ప్ర‌ధానంగా ఏపీ ప్రభుత్వ వైఫల్యాలపై సోషల్ మీడియాలో జనసేన పార్టీకి చెందిన శతఘ్నిటీమ్ ‘వైఎస్ జగన్ ఫెయిల్డ్ సీఎం’ అనే క్యాంపైయిన్‌నే న‌డిపించిన విష‌యం తెలిసిందే. ఒకానొక ద‌శ‌లో వైసీపీ ప్ర‌భుత్వం, జ‌న‌సేన మ‌ధ్య ప‌రిస్థితులు తీవ్ర‌స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో అప్పట్లో జ‌న‌సేన‌ పార్టీకి చెందిన ట్విట్టర్ ఖాతాలు సస్పెండ్ అయిన విష‌యం తెలిసిందే. దానిపై ఆ సంస్థను జ‌న‌సేనాని పవన్ ప్రశ్నించడం.. ఆ తరువాత ఆ ఖాతాలు మళ్లీ యాక్టివ్ అవ్వడం తెలిసిందే.

ఇలా ఒక్క‌సారిగా ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అయితే.. సీఎం జ‌గ‌న్ మాత్రం ఎక్క‌డ కూడా దీనిపై స్పందించ‌లేదు. సైలెంట్‌గా ఉన్నారు. అయితే.. అనూహ్యంగా.. సీన్‌లోకి చిరంజీవి వ‌చ్చారు. సైరా న‌ర‌సింహారెడ్డి విజ‌యం త‌ర్వాత ఆయ‌న సీఎం జ‌గ‌న్‌ను క‌లిసిన త‌ర్వాత‌ జ‌న‌సేన అధినేత ప‌న‌వ్‌లో మార్ప మొద‌లైంద‌నే టాక్ వినిపిస్తోంది. అయితే.. జ‌గ‌న్ విష‌యంలో ప‌వ‌న్‌కు చిరు ఎలాంటి స‌ల‌హాలు ఇచ్చార‌న్న దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాస్త త‌గ్గి ఉండాల‌ని ప‌వ‌న్‌కు చిరు సూచించి ఉంటార‌నే వాద‌నే బ‌లంగా వినిపిస్తోంది.

అయితే చిరు ఇలా చెప్ప‌డానికి కూడా బ‌ల‌మైన కార‌ణాలు ఉన్నాయట‌. నిజానికి.. జ‌గ‌న్ ఎంత ప‌ట్టుద‌ల ఉన్న వ్య‌క్తో, మ‌రెంత మొండిత‌నం ఉన్న నాయ‌కుడో అంద‌రికీ తెలిసిందే. రాజ‌కీయ ఉద్దండుల‌ను మ‌ట్టిక‌రిపించి, త‌న రాజ‌కీయ చ‌తుర‌త‌ను చాటిచెప్పారు. ఇక ఏపీ సీఎం అయిన త‌ర్వాత త‌న‌దైన శైలిలో పాల‌న సాగిస్తున్నారు. నిజానికి.. వైఎస్సార్ క‌న్నా జ‌గ‌న్ మొండిఘ‌టం అని మాజీ సీఎం చంద్రబాబు సహా పలువురు రాజకీయ నాయకులు బహిరంగంగానే అన్నారు.

అయితే.. ఈ ప‌రిణామాల‌న్నింటినీ జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తున్న చిరు.. సైరా న‌ర‌సింహారెడ్డి విజ‌యం త‌ర్వాత జ‌గ‌న్‌ను క‌లిసి.. ప‌లు అంశాల‌పై చ‌ర్చించార‌ని, ఇదే స‌మ‌యంలో ప‌వ‌న్‌కు చిరు ప‌లు విలువైన సూచ‌న‌లు చేసి ఉంటారనే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. అందుకే ఈ మధ్య ప‌వ‌న్ కాస్త సైలెంట్‌గా ఉంటున్నార‌ని జ‌న‌సేన శ్రేణులు కూడా గుస‌గుస‌లాడుకుంటున్నాయి.

జగన్ విషయంలో పవన్ కు చిరు సలహా ఇదే !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts