కేసీఆర్ ఝ‌ల‌క్ ఇచ్చిన ప‌వ‌న్…!

October 9, 2019 at 4:46 pm

తెలంగాణ సీఎం కేసీఆర్ కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ భారీ ఝ‌ల‌క్ ఇచ్చారు. ఇంత‌కాలం తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అన్ని విష‌యాల్లో అండ‌గా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు యూ ట‌ర్న్ తీసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా కేసీఆర్ కు ఉద్య‌మాల‌ను సానూభూతితో అర్థం చేసుకోవాల‌ని సూచ‌న చేశారు ప‌వ‌న్‌. ఆర్టీసీ కార్మికులు త‌మ న్యాయ‌మైన డిమాండ్ల కోసం గ‌త కొన్ని రోజులుగా స‌మ్మె చేస్తున్నారు. ద‌స‌రా పండుగ‌ను కాద‌ని, త‌మ కుటుంబాలు ద‌సరా పండుగ జ‌రుపుకోకున్నా కూడా ఆర్టీసీ కార్మికులు ప‌ట్టిన ప‌ట్టు విడ‌వ‌కుండా త‌మ పోరాటాన్ని ముందుకు సాగిస్తున్నారు.

అయితే ఆర్టీసీ కార్మికుల స‌మ్మెకు అన్ని రాజ‌కీయ పార్టీలు, ప్ర‌జాసంఘాలు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు సంఘీభావం ప్ర‌క‌టించాయి. ఆర్టీసీ కార్మికులు కూడా ప‌ట్టుద‌ల‌తో ముందుకు సాగుతున్నారే కానీ ప్ర‌భుత్వం బెదిరిస్తున్నా లొంగ‌డం లేదు. దీంతో కేసీఆర్ ఏకంగా వేలాది మంది ఉద్యోగుల‌ను ఒక్క క‌లం పోటుతో తొల‌గిస్తున్నట్లు ప్ర‌క‌టించారు. ఇప్పుడు జ‌న‌సేన కూడా ఆర్టీసీ కార్మికులకు మ‌ద్ద‌తుగా, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది.

ఆ పోస్టులో తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు చేసే ఆందోళనలను ప్రభుత్వాలు సానుభూతితో అర్థం చేసుకొని పరిష్కరించాలే తప్ప కఠినమైన నిర్ణయాలు తీసుకోకూడదు అంటూ – జనసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు హిత‌బోధ చేశారు. అంతే కాకుండా ఉద్యోగుల తొలగింపు ఆందోళ‌న‌క‌రం అంటూ ఓ టైటిల్ పెట్టి తెలంగాణ ఉద్య‌మంలో స‌క‌ల జ‌నుల స‌మ్మెతో 17రోజుల పాటు ఆర్టీసీ ఉద్యోగులు స‌మ్మె చేసి ఉద్య‌మానికి అండ‌గా ఉన్నారు. వారు చేసిన త్యాగాన్ని మ‌నం గుర్తు చేసుకోవాలి.

ఉద్యోగుల ప‌ట్ల ఉదార‌త చూపి ఆర్టీసీ స‌మ్మెను సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించాల‌ని కేసీఆర్ గారిని కోరుతున్నాను అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వేడుకున్నారు. అయితే గ‌తంలో యురేనియం త‌వ్వ‌కాల‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ద్దతు ప్ర‌కటించారు. ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆర్టీసీ కార్మికుల‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డంతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో వేచిచూడాల్సిందే.

కేసీఆర్ ఝ‌ల‌క్ ఇచ్చిన ప‌వ‌న్…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts