ప‌వ‌న్ త‌ర్జ‌న భ‌ర్జ‌న‌..ఎంట్రీ ఇవ్వాలా? వ‌ద్దా?

October 15, 2019 at 12:26 pm

ప‌వ‌ర్ స్టార్‌, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. గొప్ప సందేహంలో ప‌డిపోయారు. ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఆయ‌నకు ఖాళీ స‌మ‌యం పెరిగిపోయింది.ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో కీల‌క రోల్ పోషించాల‌ని అనుకున్నా.. ఎక్క‌డా ప‌వ‌న్ వ్యూహాన్ని ప్ర‌జ‌లో.. ప్ర‌జ‌ల ఆలోచ‌న‌ను ప‌వ‌నో అర్ధం చేసుకోని కార‌ణంగా.. ప‌రిస్థితి రివ‌ర్స్ కొట్టింది. అదే స‌మ‌యంలో తాను పోటీ చేసిన రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ప‌వ‌న్ ఘోరంగా ఓట‌మిపాల‌య్యారు. దీంతో ఆయ‌నకు పెద్ద‌గా ప‌ని లేకుండా పోయింద‌నే చెప్పాలి. ఎన్నిక‌ల‌కు ముందు ఏడాది వ‌ర‌కు సినిమా షూటింగుల‌తో బిజీ అయిన ప‌వ‌న్‌.. త‌ర్వాత ఎన్నిక‌ల నేప‌థ్యంలో విరామం ప్ర‌క‌టించారు.

అయితే, ఇప్పుడు ప‌వ‌న్‌కు ఖాళీ స‌మ‌యం పెరిగిపోవ‌డం, అటు రాజ‌కీయంగా కూడా పెద్ద‌గా చేయాల్సిన కార్య‌క్ర‌మాలు ఏవీ లేక‌పోవ‌డంతో ప‌వ‌న్ మ‌ళ్లీ తెర‌మీద‌కి వెళ్లాల‌ని భావిస్తున్నారా? అనే సందేహాలు వ‌స్తున్నా యి. అభిమానులు, పార్టీ నాయ‌కులు కూడా ప‌వ‌న్ తెర‌మీదికి వెళ్ల‌డ‌మే బెట‌ర్ అనిఆర్థికంగా ఆయ‌న పుంజుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. ఇదిలావుంటే, ప‌వ‌న్ కోసం నిర్మాత‌లు ప‌డిగాపులు కాస్తున్నారు. ప్ర‌స్తుతం త‌న వ్యూహం అంతా కూడా పార్టీపై నే ఉంటుంద‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించినా.. ఇప్పుడు ఆయ‌న సినిమాల‌పై దృష్టి సారిస్తార‌ని, మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు లేదా పార్టీని అభివృద్ది చేసుకునేందుకు చాలా స‌మ‌యం ఉంద‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు.

ఇక‌, ప‌వ‌న్ కూడా మ‌దిలో ఈ విష‌యంలో చింతిస్తున్న‌ట్టే స‌మాచారం. ఆయ‌న కు కూడా ఇప్పుడు సినిమాల‌పై ధ్యాస మ‌ళ్లుతోంది. ఈ క్ర‌మంలోనే నిర్మాత‌ల‌ను ద‌ర్శ‌కుల‌కు ట‌చ్‌లోనే ఉన్నారు. వారు చెబుతున్న క‌థ‌ల‌ను ఆల‌కిస్తున్నారు. అయితే, ఔన‌ని, కాద‌ని ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌డం లేదు. ఎవ‌రైనా ఏమైనా అనుకుంటార‌ని భావిస్తున్నారో ఏమో.. సైలెంట్‌గా ఉంటున్నారు. కానీ, వాస్త‌వం మాత్రం ఇప్పుడున్న ప‌రిస్థితిలో ప‌వ‌న్‌.. మూవీల్లో కి వెళ్ల‌డ‌మే బెట‌ర్ అని అనే అభిమానులు పెరుగుతున్నారు. రాజ‌కీయ విమ‌ర్శ‌లు ఎప్పుడూ ఉండేవే కావ‌డంతో వాటిని పెద్ద‌గా ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు. ఈ విష‌యంలో ప‌వ‌న్ త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. మ‌రి ఏం చేస్తాడో చూడాలి.

ప‌వ‌న్ త‌ర్జ‌న భ‌ర్జ‌న‌..ఎంట్రీ ఇవ్వాలా? వ‌ద్దా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts