హీరోయిన్ ప్రాణాలు తీసిన అంబులెన్స్‌

October 22, 2019 at 10:46 am

ప్ర‌జ‌లు ప్రాణాపాయ స్థితిలో ఉన్న‌ప్పుడు క్ష‌ణాల్లో వాలిపోయి వారిని కాపాడే అంబులెన్స్‌లో ఒక్కోసారి ఆల‌స్యంగా రావ‌డంతో ప్రాణాలు పోతోన్న సంఘ‌ట‌న‌లు మ‌నం చూస్తూనే ఉన్నాం. తాజాగా అంబులెన్స్ స‌కాలంలో రాక ఓ మ‌రాఠి న‌టి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద సంఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని హింగోలి జిల్లాలో వెలుగుచూసింది. పూజా జుంజార్(25) మరాఠీ సినిమానటి. ఆమె మ‌రాఠా సినిమాల్లో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఆమె ఉన్న ప్రాంతం ముంబై మ‌హాన‌గ‌రానికి 590 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది.

గ‌ర్భం దాల్చిన పూజ పురిటి నొప్పుల‌తో ఉండ‌గా ఆమెను తెల్లవారుజామున రెండు గంటలకు గోరేగాంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. పూజా ఓ శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువు జ‌న్మించిన కొద్ది సేప‌టికే మృతి చెందింది. ఆ త‌ర్వాత పూజా ప‌రిస్థితి కూడా విష‌మించ‌డంతో ఆమెను హింగోలీ ఆసుప‌త్రికి త‌రలించాల‌ని ప్రాథమిక వైద్యకేంద్రం వైద్యులు సూచించారు. ఆమెను హింగోలీకి తీసుకు వెళ్లాలంటే 40 కిలోమీట‌ర్లు త‌ర‌లించాలి. అయితే స‌కాలంలో అంబులెన్స్ రాలేదు.

వెంట‌నే పూజా బంధువులో ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో హింగోలీ ఆసుప‌త్రికి తీసుకు వెళుతుండ‌గా మార్గ‌మ‌ధ్య‌లోనే ఆమె మ‌ర‌ణించింది. అంబులెన్స్ సకాలంలో లభించనందు వల్లే వైద్యం అందక మరాఠీ సినీనటి పూజా జుంజార్ మరణించడంతో ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు. ఇప్పుడే మరాఠా చిత్ర‌సీమ‌లో వ‌ర్థ‌మాన న‌టిగా రాణిస్తోన్న ఆమె పెళ్లి చేసుకుని గ‌ర్భం దాల్చ‌డంతో కాస్త గ్యాప్ తీసుకున్నారు. ఇంత‌లోనే ఆమె తిరిగి రాని లోకాల‌కు వెళ్లిపోయారు. ఆమెతో పాటే పుట్టిన శిశువు కూడా మృతి చెంద‌డంతో కుటుంబ సభ్యుల్లో మ‌రింత విషాదం నింపింది.

హీరోయిన్ ప్రాణాలు తీసిన అంబులెన్స్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts