రాగ‌ల 24గంట‌ల్లో టీజ‌ర్‌…!

October 10, 2019 at 4:33 pm

ఈ మ‌ద్య కాలంలో టీజ‌ర్లు మాట‌ల్లేకుండా రిలీజ్ చేస్తున్నారు. సినిమాపై భారీ హైప్ క్రియోట్ చేయ‌డంలో భాగంగా ఇలా మాట‌ల్లేని టీజ‌ర్‌ల‌ను విడుద‌ల చేస్తున్నార‌ట‌. ఈ టీజ‌ర్లు సిని ప్రేమికుల‌ను బాగా ఆక‌ట్టుకుంటున్నాయి.. ఇప్పుడు కూడా రాగ‌ల 24గంట‌ల్లో సినిమా టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. మాట‌ల్లేకుండానే కేవ‌లం యాక్ష‌న్ తోనే టీజ‌ర్‌ను విడుద‌ల చేసి సినిమాపై భారీ స‌స్పెన్స్‌ను క్రియోట్ చేస్తున్నారు.

శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ నివాస్ క్రియోష‌న్ లో వ‌స్తున్న చిత్రం రాగ‌ల 24గంట‌ల్లో సినిమా. ఈ సినిమా టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ సినిమా లో హీరోయిన్లుగా స‌త్య‌దేవ్‌, ఈషారెబ్బా న‌టిస్తున్నారు. స‌త్య‌దేవ్ ఓ పోలీస్ పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు చిత్ర టీజ‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. టీజ‌ర్‌లో పోలీసులు ఓ వ్య‌క్తిని కార్న‌ర్ చేసి ఎన్‌కౌంట‌ర్ చేస్తారా అనేలా కట్ చేశారు.

రాగ‌ల 24గంట‌ల్లో సినిమా ఓ మ‌ర్డ‌ర్ నేప‌థ్యంలో జ‌రిగే సంఘ‌ట‌న‌ల‌ను బేస్ చేసుకుని తెర‌కెక్కించిన‌ట్లుగా టీజ‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఇక ఈ సినిమా మొత్తానికి ఓ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ సినిమాగా అనిపిస్తుంది. టీజ‌ర్ ను 1.32నిమిషాల నిడివితో క‌ట్ చేసినా అంతా స‌స్పెన్స్ తోనే ఉంది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు ర‌ఘు కుంచే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

రాగ‌ల 24గంట‌ల్లో టీజ‌ర్‌…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts