రాజుగారి గ‌ది 3 రివ్యూ &రేటింగ్

October 18, 2019 at 5:42 pm

బ్యాన‌ర్‌: ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
న‌టీన‌టులు: అశ్విన్ బాబు, అవికాగోర్‌, అలీ, బ్ర‌హ్మాజీ, ప్ర‌భాస్ శ్రీను, అజ‌య్‌ఘోష్‌, ఊర్వ‌శి, హ‌రితేజ త‌దిత‌రులు
సినిమాటోగ్రఫీ: చోటా కె నాయుడు
సంగీతం: షబ్బీర్
దర్శకత్వం: ఓంకార్
సెన్సార్ రిపోర్ట్ : యూ / ఏ
రిలీజ్ డేట్‌: 18 అక్టోబ‌ర్‌, 2019

రాజు గారి గది సినిమాతో తెలుగు తెరకు హార్రర్ కామెడీని కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసి దర్శకుడిగా మారాడు ఓంకార్. చాలా త‌క్కువ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో వ‌రుస‌గా రాజుగారి గ‌దికి సీక్వెల్స్ స్టార్ట్ చేశాడు. రాజుగారి గ‌ది 2, రాజుగారి గ‌ది 3 ఇలా వ‌రుస పెట్టి సినిమాలు తీస్తున్నాడు ఈ క్ర‌మంలోనే తాజాగా రాజుగారి గ‌ది 3 పేరుతో ఓంకార్ మరోసారి ప్రేక్షకులను నవ్విస్తూ భయపట్టేందుకు రెడీ అయ్యాడు. ఈ రోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ అవుతోన్న ఈ సినిమా ఎలా ఉందో TJ స‌మీక్ష‌లో చూద్దాం.

క‌థ‌:
డాక్ట‌ర్ మాయ(అవికాగోర్‌) ఓ హాస్ప‌ట్లో ప‌ని చేస్తుంటుంది. ఆమెకు ఎవ‌రైనా ఐ ల‌వ్ యు చెపితే ఓ ఆత్మ వ‌చ్చి వాళ్ల‌ను చిత‌క్కొట్టేస్తుంది. అందుకే ఎవ్వ‌రు ఆమెను ప్రేమించే సాహ‌సం కూడా చేయ‌రు. ఓ అనాథ అశ్విన్ (అశ్విన్‌బాబు) ఆలీతో ఉంటుంటాడు. మాయ ప‌నిచేసే హాస్ప‌ట‌ల్లో ఉండే మ‌రో డాక్ట‌ర్ అశ్విన్ మందు తాగి త‌న‌ను రోజూ టార్చ‌ర్ పెడుతుండడంతో అత‌డి నుంచి త‌ప్పించుకునేందుకు ఓ స్కెచ్ వేసి అశ్విన్‌కు, మాయ‌కు ప్రేమ పుట్టేలా చేస్తాడు. సేమ్ అశ్విన్ ఆమెకు ఐ ల‌వ్ యు చెప్ప‌గానే మ‌ళ్లీ ఆత్మ వ‌చ్చి అత‌డిని చిత‌క్కొడుతుంది. అస‌లు మాయ‌ను ఆవ‌హించిన ఆత్మ ఎవరు ? ఈ క‌థ‌కు కేర‌ళ‌లోని ప్ర‌ముఖ భూత మాంత్రికుడు గ‌రుడ‌ పిళ్లై(అజ‌య్ ఘోష్‌)కు ఉన్న లింక్ ఏంటి ? మాయ కోసం కేర‌ళ వెళ్లిన అశ్విన్‌కు తెలిసిన నిజాలు ఏంటి ? మాయ‌ను కాపాడే యక్షిణి ఎవ‌రు? చివ‌ర‌కు మాయ – అశ్విన్ ప్రేమ క‌థ ఏమైంది ? అన్న‌దే ఈ సినిమా స్టోరీ.

విశ్లేష‌ణ :
ఇప్ప‌టికే ఈ సీరిస్‌లో రెండు సినిమాలు రావ‌డంతో మూడో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. తొలి రెండు సినిమాల్లో హ‌ర్ర‌ర్‌, కామెడీతో పాటు మెసేజ్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు మూడో సినిమాలో హ‌ర్ర‌ర్‌, కామెడీకి ప్ర‌యార్టీ ఇచ్చి మెసేజ్ వ‌దిలేశాడు. ఇక ఇటీవ‌ల టాలీవుడ్లో ఈ జాన‌ర్ సినిమాలు ఎక్కువ అయిపోయాయి. ఈ క్ర‌మంలోనే రాజుగారి గ‌ది 3 మ‌రి అంత కొత్త‌గా ఉన్న‌ట్టు అనిపించ‌దు.

సినిమా ఫ‌స్టాఫ్ అంతా సాగ‌దీత‌గా న‌డుస్తుంది. సినిమాకు కీల‌క‌మైన సెకండాఫ్ మీద మాత్రం బాగానే కాన్‌సంట్రేష‌న్ చేశారు. సెకండాఫ్‌లో వ‌చ్చే బంగ్లాలోని హార‌ర్ కామెడీ స‌న్నివేశాలు… ప్రీక్లైమాక్స్‌లో వ‌చ్చే 20 నిమిషాల‌ హార‌ర్ కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్ష‌కుల‌ను బాగా న‌వ్విస్తాయి.

అమ్మాయి వెంట‌ప‌డే వాళ్ల‌ను యక్షిణి ఫుట్‌బాల్ ఆడ‌డం కాన్సెఫ్ట్ బాగానే ఉన్నా రాజుగారి గదిలోకి పాత్రలు ఎంటరైన తర్వాత పూర్తిగా కామెడీ మీద ఫోకస్‌ చేయడం కొంత ప్రేక్షకులకు నిరాశకు గురిచేయవచ్చు. అంతగా భయపెట్టి థ్రిల్‌ చేసే అంశాలు సినిమాలో లేకపోవడం మైనస్‌.

న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే అశ్విన్‌బాబు పాత్ర చుట్టూనే క‌థంతా తిరుగుతుంది. అశ్విన్‌బాబును కావాల‌ని హైలెట్ చేశారు. అవికా గోర్ పాత్ర ఓకే అనిపించింది. సినిమాలో అజ‌య్‌ఘోష్‌, ఐశ్వ‌ర్య, అలీ పాత్ర‌ల‌తోనే సినిమా ఆ మాత్ర‌మైనా కామెడీగా అనిపించింది. ష‌బ్బీర్ సంగీతం, చోటా కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ హైలెట్‌గా ఉన్నాయి.

ఫ్ల‌స్‌లు (+ ) :
– ఓంకార్ టేకింగ్‌
– మెయిన్ స్టోరీ లైన్‌
– సినిమాటోగ్ర‌ఫీ, మ్యూజిక్
– సెకండాఫ్‌
– కామెడీ

మైన‌స్‌లు (-):
– భ‌య‌పెట్ట‌ని హ‌ర్ర‌ర్ సీన్లు
– ఫ‌స్టాఫ్ సాగ‌దీత‌
– క‌థ‌నం సాలీడ్‌గా లేక‌పోవ‌డం

ఫైన‌ల్‌గా..
హ‌ర్ర‌ర్ బోర్‌… కామెడీ ఫుల్‌

రాజుగారి గ‌ది 3 TJ రేటింగ్‌: 2.5 / 5

రాజుగారి గ‌ది 3 రివ్యూ &రేటింగ్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts