బ్రేక్ ఈవెన్ దిశ‌గా రాజుగారి గ‌ది3..!

October 21, 2019 at 3:57 pm

రాజు గారి గ‌ది సిరీస్‌లో వ‌చ్చిన రాజుగారి గ‌ది 3 సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే దిశ‌గా అడుగులు వేస్తుందా..? ఇప్పుడు రాజు గారి గ‌ది 3 బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఎంత వ‌సూలు చేయాలి.. ఇప్ప‌టి ఎంత వ‌సూలు చేసింది.. ఇంకా ఎంత వ‌సూలు చేస్తే బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది.. అస‌లు రాజు గారి గ‌ది 3 సినిమాకు అడ్డుగా నిలుస్తున్న సినిమాలు ఏమిటీ ఓ సారి చూస్తే తేలిపోతుంది…

ప్ర‌ముఖ యాంక‌ర్ ఓంకార్ నిర్మాత‌గా మారి ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ‌ను స్థాపించారు. ఈసంస్థ నుంచే ఇప్ప‌టికే రాజు గారి గ‌ది సినిమాల‌కు శ్రీ‌కారం చుట్టారు. బుల్లితెర‌పై హ‌ర్ర‌ర్ కామెడీని పండిస్తూ యాంక‌రింగ్‌, రియాల్టి షోల‌కే అంకురార్ప‌ణ చేసిన ఓంకార్ వెండితెరపై ద‌ర్శ‌కుడిగా మారారు. అలా రాజు గారి గ‌దికి నాంధి ప‌లికింది. ఇప్పటికే రాజు గారి గ‌ది సినిమా బ్లాక్ బ్ల‌స్ట‌ర్‌గా నిలిచిపోగా, రాజు గారి గ‌ది 2 సినిమా డిజాస్ట‌ర్ అయింది.

అయితే ఇప్పుడు రాజు గారి గ‌ది 3 సినిమా రెండు సినిమాల‌ను మించి ఆడేలా క‌నిపిస్తుంది. అందుకే ఇప్ప‌టికి బాక్సాఫీసు వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపిస్తుంది. ఈ సినిమాను ఫ్రీ బిజినెస్‌గా రూ.4కోట్ల‌కు అమ్మారు. ఈ సినిమా ఇప్ప‌టికే దాదాపుగా మూడు రోజుల్లోనే రూ.3.5కోట్ల‌ను సాధించింది. అంటే మ‌రో రూ.50ల‌క్ష‌లు వ‌సూలు చేస్తే సినిమా బ్రేక్ ఈవెన్ సాధించిన‌ట్లే లెక్క‌. ఇక ఈ సినిమాకు ఇప్ప‌ట్లో ఏసినిమాలు పోటీ లేవు. కేవ‌లం త‌మిళ సినిమాలు మాత్ర‌మే పోటీ వ‌స్తున్న‌ప్ప‌టికి అవి పెద్ద‌గా ఈ సినిమాకు అడ్డు కాద‌నే టాక్ వినిపిస్తుంది. అంటే ఈ సినిమా ఫుల్ ర‌న్ టైమ్‌లో మ‌రింత వ‌సూళ్ళు సాధించే అవ‌కాశం ఉంది.. బ‌య్య‌ర్ల‌కు లాభాలు తెచ్చిపెట్టె సినిమాగా మార‌నున్న‌ది..

బ్రేక్ ఈవెన్ దిశ‌గా రాజుగారి గ‌ది3..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts