అయ్యే..రామ్ చ‌ర‌ణ్ సినిమాను లాగేసుకున్న వెట‌ర‌న్ హీరో..!

October 25, 2019 at 10:54 am

త‌మిళ‌నాట విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం అందుకుని భారీ వ‌సూళ్ళ‌తో బాక్సాఫీసును బ‌ద్ద‌లు కొట్టిన చిత్రం అసుర‌న్‌. ఈ చిత్ర హీరో త‌మిళ స్టార్ ధ‌నుష్ కేరీర్‌లోనే అత్యంత భారీ వ‌సూళ్ళు చేసిన చిత్రం అసుర‌న్‌. ఈ సినిమా సాధా సీదాగానే ఉంటుంది. కానీ ఈ సినిమాను తెర‌కెక్కించిన విధానం, హీరో ధ‌నుష్ న‌ట‌న‌, ద‌ర్శ‌కుడు ప్ర‌తిభ ఆధారంగా అసుర‌న్ సినిమా క‌నివిని ఎరుగుని విజ‌యాన్ని అందుకుంది.

ద‌స‌రా పండుగ‌ను పురస్క‌రించుకుని త‌మిళంలో విడుద‌ల అయిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాల‌ని అనుకున్నారు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. ఈ మెగా హీరోతో పాటుగా ప్రిన్స్ మ‌హేష్ బాబు కూడా అసుర‌న్ చిత్రంలో న‌టించాల‌ని ప్ర‌య‌త్నించారు. కానీ ఈ ప్రాజెక్టును రీమేక్ సినిమాలో న‌టిస్తున్న‌ట్లు వెట‌ర‌న్ హీరో ప్ర‌క‌టించారు. రామ్ చ‌ర‌ణ్‌, ప్రిన్స్‌ను కాద‌ని ఈ వెట‌ర‌న్ హీరో సినిమా చూసిన వెంట‌నే రీమేక్‌కు సై అన‌డం, ప్ర‌క‌టించ‌డంతో పాపం రామ్ చ‌ర‌ణ్ ప‌రిస్థితి ధీనంగా మారింది.

ఇంత‌కు అసుర‌న్ చిత్రం రీమేక్ లో న‌టించాల‌ని ప్ర‌క‌టించిన హీరో ఎవ‌రో తెలుసా.. ఆయ‌నే విక్ట‌ర్టీ వెంక‌టేశ్‌. విక్ట‌రీ వెంక‌టేశ్ ఈ సినిమాను వీక్షించిన వెంట‌నే సినిమా రీమేక్ చేస్తున్న‌ట్లు.. అందులో తాను న‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. అయితే ఈ సినిమా హ‌క్కులు వెంక‌టేశ్ తీసుకున్నాడా లేదా, ఒక‌వేళ తీసుకుంటే ఈ సినిమాను అసుర‌న్‌కు అచ్చుగుద్దిన‌ట్లుగా తెర‌కెక్కిస్తారా.. ఏమైనా మార్పులు చేస్తారా.. ఇంత‌కు ద‌ర్శ‌కుడు ఎవ్వ‌రు అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. సో రామ్ చ‌ర‌ణ్ చేద్దామ‌నుకున్న ఈ చిత్రం వెంక‌టేశ్ లాగేసుకున్నార‌ని చిత్ర సీమ‌లో ప్ర‌చారం జ‌రుగుతుంది.

అయ్యే..రామ్ చ‌ర‌ణ్ సినిమాను లాగేసుకున్న వెట‌ర‌న్ హీరో..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts