రామ్ గోపాల్ వ‌ర్మ‌ క‌ల‌ల‌కు ప్ర‌తీరూపం”బ్యూటీఫుల్‌” టీజ‌ర్‌…!

October 9, 2019 at 11:34 am

మాట‌లు ల్లేవ్‌.. మాట్లాడుకోవ‌టాలు లేవు.. అంతా ముద్దులు.. బీచ్‌లో రోమాన్స్‌.. ప‌రుగెత్తె గుర్రం ఎలాంటిదో యువ‌తి యువ‌కుల ప్రేమ కూడా అలాగే ప‌రుగెత్తుతుంది.. అని చెప్పేందుకు సింభాలిక్‌గా బీచ్‌లో ప‌రుగెత్తుతున్న గుర్రాన్ని చూపాడు ద‌ర్శ‌కుడు.. హీరో పార్థ్‌సూరి, హీరోయిన్ నైనా గంగూళీ త‌మ రోమాన్స్‌తో ఎలా మ‌త్తెక్కించారో ఈ సినిమా చెపుతుంది. సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌ త‌న క‌ల‌ల‌కు ప్ర‌తీరూపంగా అగ‌స్త మంజు చేత తెరకెక్కించిన చిత్ర‌మే బ్యూటీఫుల్‌..

ఈ సినిమా టీజ‌ర్‌ను కొద్ది సేప‌టి క్రితం విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌. అయితే సినిమాలో ఎక్క‌డా మాట‌లు లేకుండా క‌ట్ చేశారు. అంతా రొమాన్సే ప్ర‌ధానంగా టీజ‌ర్‌ను నింపేశాడు.. ఓ రిచ్ అమ్మాయి.. ఓ బీచ్ అబ్బాయితో ప్రేమ‌లో మునిగిపోతే ఎలా ఉంటుందో.. ఎల్ల‌ప్పుడు డ‌బ్బే ప్ర‌ధానం కాదు.. ప్రేమ‌, రొమాన్సే ప్ర‌ధానం అని చూపిన సినిమా బ్యూటీఫుల్‌. టీజర్‌లో స‌ముద్ర అల‌ల‌ల్లో హీరో, హీరోయిన్లు న‌డిపే రోమాన్స్ చూస్తే సినిమాపై భారీ అంచ‌నాలే పెరిగిపోయేలా ఉన్నాయి.

బ్యూటీఫుల్ సినిమాకు పేరుకు త‌గ్గ విధంగా ఓ అంద‌మైన రిచ్ అమ్మాయిని, ప్రేమే లోకంగా బ‌తికే ఓ బీచ్‌లో మెకానిక్‌తో ఎలా ప్రేమ‌లో ప‌డింది.. అని చూపారు ద‌ర్శ‌కుడు అగ‌స్త్య మంజు. ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఎలాంటి జీవితాన్ని కోరుకుంటాడో అలాంటి క‌థ‌తోనే సినిమాను రూపొందించారు. . వ‌ర్మ త‌న‌దైన స్టైల్‌లో ద‌ర్శ‌కుడి చేత సినిమాను తెర‌కెక్కించార‌నే చెప్ప‌వ‌చ్చు.. ఈసినిమాను టైగ‌ర్ కంపేనీ ప్రొడ‌క్ష‌న్‌లో న‌రేష్ కుమార్‌, టి.శ్రీ‌ధ‌ర్ నిర్మిస్తున్నారు. సంగీతం ర‌విశంక‌ర్ అందిస్తున్నారు.

రామ్ గోపాల్ వ‌ర్మ‌ క‌ల‌ల‌కు ప్ర‌తీరూపం”బ్యూటీఫుల్‌” టీజ‌ర్‌…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts