రానాకు అది ఎక్కువై చిక్కిపోయాడ‌ట‌….!

October 15, 2019 at 4:52 pm

టాలీవుడ్ భ‌ల్లాల‌దేవ‌కు ఆప‌రేష‌న్ అయింది నిజ‌మేన‌ట‌.. అంతేకాదు.. బాగానే కోలుకుంటున్న‌ప్ప‌టికి ఆయ‌న‌కు మ‌రోక‌టి ఎటాక్ అయి బాగా చిక్కిపోయాడ‌ట‌.. అదేం లేదు.. నేను బాగానే ఉన్నాను.. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ మీ ముందుకు వ‌స్తాను.. సినిమాల్లో న‌టిస్తాన‌ని భ‌ల్లాల‌దేవ అంటున్నాడు.. కాదు కాదు ఆయ‌న ఆరోగ్యంగా ఉన్నాడు.. కాకుంటే కొద్ది రోజులు ఆగాలి.. ఇప్పుడు న‌టించ‌డు.. త‌రువాత న‌టిస్తాడ‌ని మ‌రొక‌రు అంటున్నారు..

ఇంత‌కు భ‌ళ్లాల‌దేవ ఉర‌ఫ్ రానా ద‌గ్గుబాటికి ఏమైంది.. ఏ ఆప‌రేష‌న్ అయింది.. ఇప్పుడు ఎలా ఉన్నాడు… ఎందుకు బాగా చిక్కిపోయాడు.. ఇక సినిమాల్లో న‌టించ‌డం సాధ్యం కాదా.. అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి.. వీటికి రానా తండ్రి ద‌గ్గుబాటి సురేష్ పుల్‌స్టాఫ్ పెట్టాడు. రానాకు కంటి చూపు మంద‌గించ‌డంతో ఆప‌రేష‌న్ అయింది నిజ‌మే.. చిన్న‌ప్పటి నుంచి రానాకు కంటి వ్యాధి ఉంది. అందుకే అది ఇప్పుడు ఆప‌రేష‌న్ చేయాంచాల్సి వ‌చ్చింది.

కంటి ఆప‌రేష‌న్ బాగానే జ‌రిగింది. కానీ ఎందుకో బీపీ పెరిగింది. దీన్ని కంట్రోల్ చేసే క్ర‌మంలో బాగా బ‌క్క‌ప‌డ్డాడు అని సురేష్ ప్ర‌క‌టించారు. రానా ప్ర‌స్తుతం కోలుకున్నాడు.. కాకుంటే బ‌ల‌హీనంగా ఉండ‌టం చేత రెస్ట్ తీసుకుంటున్నాడు అని సురేష్ అన్నారు. అయితే ప్ర‌స్తుతం రానా విరాట ప‌ర్వం సినిమా షూటింగ్ ఆగిపోయింది. దీనికి తోడు మ‌రో ఏడేనిమి ప్రాజెక్టులు ఆయ‌న కోసం ఆగిపోయాయ‌ట‌. అందుకే ఆయ‌న రాగానే త్వ‌ర‌లో అన్ని ప్రాజెక్టులు పూర్త‌వుతాయ‌ట‌…

రానాకు అది ఎక్కువై చిక్కిపోయాడ‌ట‌….!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts