పారితోషికం కన్నా అదే ముఖ్యమంటున్న హీరోయిన్..!

October 21, 2019 at 11:23 am

కన్నడ నుండి వచ్చిన రష్మిక మందన్న తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఛలో, గీతా గోవిందం బ్యాక్ టూ బ్యాక్ హిట్లు అందుకున్న రష్మిక ఆ తర్వాత చేసిన దేవదాస్, డియర్ కామ్రేడ్ సినిమాలు ఫలితాలు తేడా కొట్టినా అమ్మడి క్రేజ్ మాత్రం డబుల్ అయ్యింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండకు పర్ఫెక్ట్ పెయిర్ అంటే రష్మికనే అనేలా ఈ ఇద్దరి జోడీ సూపర్ అంటున్నారు. ఇక అమ్మడి టాలెంట్ గుర్తించిన స్టార్స్ ఆమెకు వరుస అవకాశాలు ఇస్తున్నారు.

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్న రష్మిక అల వైకుంఠపురములో సినిమా తర్వాత అల్లు అర్జున్ చేసే సుకుమార్ సినిమాలో కూడా హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది. ఇదిలాఉంటే రీసెంట్ గా దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా ఛాన్స్ వచ్చినా రష్మిక మాత్రం సున్నితంగా తిరస్కరించిందట. నాగ చైతన్య హీరోగా నూతన దర్శకుడు శషి చెప్పిన కథ నచ్చడంతో దిల్ రాజు నిర్మించాలని అనుకున్నాడు.

అయితే ఆ సినిమాలో ఎలగైనా రష్మికను ఒప్పించాలని చూశాడు దిల్ రాజు. కథ విన్న రష్మిక సినిమా చేయనని చెప్పిందట. డేట్స్ అడ్జెస్ట్ అవడం లేకనే సినిమా మిస్ చేసుకుందని అంటున్నారు కాని అసలు విషయం ఏంటంటే రష్మికకు ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర అంతగా నచ్చలేదట. అందుకే ఆమె చేయనని చెప్పిందట. దిల్ రాజు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా సరే రష్మిక మాత్రం అందుకు ఒప్పుకోలేదట. మరి రష్మిక కాదన్న ఈ ప్రాజెక్ట్ ఎవరి చేతుల్లోకి వెళ్తుందో చూడాలి.

పారితోషికం కన్నా అదే ముఖ్యమంటున్న హీరోయిన్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts