రేవంత్ కోసం ఇంత ప్లాన్ గీశావా బాబూ…!

October 1, 2019 at 6:03 pm

తెలంగాణ‌లో ఉనికే లేకుండా పోయిన టీడీపీ హఠాత్తుగా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పోటీకి దిగ‌డంపై రాజ‌కీయ వ‌ర్గాల్లో ర‌క‌ర‌కాల చ‌ర్చ జ‌రుగుతోంది. త‌న అనుచ‌రుడు టీ పీసీసీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ రేవంత్ రెడ్డికి ల‌బ్ధి చేకూర్చేందుకే బాబు హుజూర్‌న‌గ‌ర్‌లో త‌మ పార్టీ అభ్య‌ర్థిని నిల‌బెట్టాడ‌నే అనుమానాలు క లుగుతున్నాయి. టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన‌ప్ప‌టికీ.. రేవంత్‌రెడ్డితో చంద్ర‌బాబుకు స‌న్నిహిత సంబంధాలున్నాయి.

కాంగ్రెస్‌లో ఉన్న‌ప్ప‌టికీ రేవంత్ రెడ్డి చంద్రబాబు సానుభూతిపరుడుగానే ఉంటున్నాడు. ఆ విషయం పలుమార్లు బహిరంగంగానే రుజువైంది కూడా.. ప్రస్తుతం తెలంగాణలో పీసీసీ పీఠం కోసం రేవంత్‌రెడ్డి తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈక్ర‌మంలోనే పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కి, రేవంత్ రెడ్డికి మధ్య కోల్డ్ వార్ న డుస్తోంది. అయితే హుజూర్‌నగర్‌ అభ్యర్థి విషయంలో రేవంత్ రెడ్డి మాట నెగ్గలేదు. దీంతో రేవంత్ రెడ్డి అధిష్టానంపై గుర్రుగా ఉన్నాడు.

ఈ నేప‌థ్యంలో రేవంత్ రెడ్డికి అడ్డుపడుతున్న ఉత్తమ్‌కు చెక్ పెట్టాలంటే హుజుర్‌నగర్‌లో ఆయన భార్య ప ద్మా వతిని ఓడించడం ఒక్క‌టే మార్గమని రేవంత్ రెడ్డి వర్గం భావిస్తోంది. ఇందుకు సహకరించే కోణంలోనే చం ద్రబాబు తన పార్టీ అభ్యర్థిని అక్కడ నిలిపార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఫ‌లితంగా ప్రతిపక్షం ఓట్లు చీల్చేందుకు బాబు ప్లాన్ చేశారని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో భార్యను గెలిపించుకోలేకపోతే ఉత్తమ్ హవా తగ్గుతుంది. అప్పుడు రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి అవకాశాలు మెరుగుపడుతాయి. అ దే జరిగితే రేవంత్ రెడ్డి ద్వారా టీ కాంగ్రెస్‌ తన కనుసన్నల్లో ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నట్టు స‌మాచారం.

హుజూర్‌న‌గ‌ర్‌లో టీడీపీ పోటీ చేయ‌డం వెనుక చంద్ర‌బాబు మ‌రో కోణం కూడా దాగి ఉంద‌ని భా విస్తున్నారు. మొన్నటి వరకు కాంగ్రెస్‌తో చెట్టాపట్టేలేసుకుని తిరిగిన చంద్రబాబు… ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు మోడీ, అమిత్‌షాల‌పై చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. తీరా ఫ‌లితాల త‌ర్వాత మోడీ పేరు కూడా ఎత్తలేదు బాబు. కానీ మోడీకి, అమిత్ షాకు మాత్రం చంద్రబాబుపై ఇంకా కోపం తగ్గలేదు. ఈ నేపథ్యంలో తాను కాంగ్రెస్‌తో లేన‌న‌ని… ఆ పార్టీతో స్నేహాన్ని వదిలేశానని బీజేపీ పెద్దలకు సంకేతాలు పంపే ఉద్దేశంతోనే హుజూర్‌నగర్‌లో టీడీపీ అభ్య‌ర్థిని చంద్ర‌బాబు బ‌రిలోకి దింపార‌ని పార్టీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

రేవంత్ కోసం ఇంత ప్లాన్ గీశావా బాబూ…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts